రక్త చరిత్ర 2 పార్ట్స్... నయిమ్ చరిత్ర 3 భాగాలు అంటున్న వర్మ
అల్రేడి తెలుగులో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా సాగిన ముఠా తగాదాల్ని..దాని చుట్టు జరిగిన రక్త పాతాని..దానికి కారణం అయిన వారి జీవిత చరిత్రల్ని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పేరు తో రెండు భాగాలుగా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే వీరప్పన్ జీవితకథతో అందరినీ మెప్పించిన వర్మకు మరో కథ దొరికేసిందట. అది మరెవరిదో కాదు… దోపిడీలు, భూదందాలు, అకృత్యాలతో అందరూ విస్తుపోయేలా చేసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ. అవును ఇటీవల ఎన్‌కౌంటర్‌లో […]
అల్రేడి తెలుగులో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా సాగిన ముఠా తగాదాల్ని..దాని చుట్టు జరిగిన రక్త పాతాని..దానికి కారణం అయిన వారి జీవిత చరిత్రల్ని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పేరు తో రెండు భాగాలుగా చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవలే వీరప్పన్ జీవితకథతో అందరినీ మెప్పించిన వర్మకు మరో కథ దొరికేసిందట. అది మరెవరిదో కాదు… దోపిడీలు, భూదందాలు, అకృత్యాలతో అందరూ విస్తుపోయేలా చేసిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ. అవును ఇటీవల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌పై సినిమా తీస్తానంటున్నాడు వర్మ. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నాను. అతను చేసిన కుట్రలు చాలా భయంకరమైనవి. నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారి తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం భయంకరమైన క్రిమినల్. నయీం గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు పెద్ద సినిమానే తీయాలి. త్వరలో నయీంపై సినిమా తీస్తాను. రక్తచరిత్ర సినిమాని రెండు భాగాల్లోనే చూపించాను. కానీ నయీం చరిత్రను మూడు భాగాల్లో చేస్తానంటూ వర్మ తన ట్విట్టర్ లో వెల్లడించారు. అయితే ఇటువంటి క్రిమినల్స్ జీవితాల్ని వెండి తెర పై చూపించడం .. క్రైమ్ ను హైలెట్ చేసినట్లు అవుతుందేమో అంటున్నారు పరిశీలకులు. వర్మ మాత్రం అటువంటివి ఏమి పట్టించుకునే ఆలోచనలోనే లేడు. ఆయనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్లడం అలవాటు కదా..!
Also Read