బెదిరింపులపై కోమటిరెడ్డి ఫిర్యాదు చేశారా?
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డబ్బుల కోసం ఎవరైనా బెదిరించారా? ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా? అయినా పోలీసులు పట్టించుకోలేదా? అధికార పార్టీకి చెందిన మంత్రి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఆ వెంటనే.. ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఇవన్నీ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి కూడా నయీం బాధితుడేనా? ఆయన కుమారుడిది రోడ్డు ప్రమాదం కాదా? మంత్రి కోమటిరెడ్డి కుమారుడిని తామే చంపి […]
BY sarvi24 Aug 2016 2:30 AM IST
X
sarvi Updated On: 24 Aug 2016 5:46 AM IST
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డబ్బుల కోసం ఎవరైనా బెదిరించారా? ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా? అయినా పోలీసులు పట్టించుకోలేదా? అధికార పార్టీకి చెందిన మంత్రి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఆ వెంటనే.. ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఇవన్నీ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి కూడా నయీం బాధితుడేనా? ఆయన కుమారుడిది రోడ్డు ప్రమాదం కాదా? మంత్రి కోమటిరెడ్డి కుమారుడిని తామే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించామంటూ నయీం భువనగిరికిచెందిన వ్యాపారి గంపా నాగేంద్రని బెదిరించి కోటి వసూలు చేశాడు. పోలీసుల కాల్పుల్లో నయీం మరణించిన తరువాత నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీం తనను బెదిరించిన ఆడియో టేపులను కూడా పోలీసులకు అందజేశాడు.
ఇప్పుడు కోమటిరెడ్డి కుమారుడి రోడ్డు ప్రమాదంపై పలు అనుమానాలు రేగుతున్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొందరు అజ్ఞాత వ్యక్తులు బెదిరించారని, ఈ విషయమైన కోమటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని, కానీ వారు పట్టించుకోలేదని సమాచారం. ఆ క్రమంలోనే ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..? 2011, డిసెంబరు 20న ఔటర్ రింగు రోడ్డుపై వెళుతున్న ప్రతీక్ రెడ్డి కారుకు అకస్మాత్తుగా గొర్రెలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తాపడి 30 అడుగుల ఎత్తుపై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ప్రతీక్ రెడ్డితో పాటు అతని ముగ్గురు స్నేహితులు, డ్రైవర్‌తో సహా మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ కేసును పోలీసులు 2012 డిసెంబరులో మూసేశారు. అయితే, వ్యాపారులను బెదిరించడానికే నయీం కోమటిరెడ్డి కుమారుడి రోడ్డు ప్రమాదాన్ని వాడుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై మరోసారి విచారణ జరిపితే.. నయీం హస్తం ఉందో లేదో తెలిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలపై కోమటిరెడ్డి కుటుంబం ఇంతవరకూ స్పందించలేదు.
Next Story