పులి మిస్సింగ్ కేసు...సిబిఐకి!
తమకు ఎంతో ప్రీతిపాత్రమైన జై అనే పులి… మిస్సింగ్ కేసుని సిబిఐ తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఏడేళ్ల వయసు, 250కేజీల బరువున్న జై …గత ఏప్రిల్ లో మహారాష్ట్రలోని ఓ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించకుండా పోయింది. జైని వెతికి పట్టుకునే పనిని సిబిఐకి అప్పగించమని తాము ప్రధానికి లేఖ రాయనున్నామని మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. జై కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం […]
తమకు ఎంతో ప్రీతిపాత్రమైన జై అనే పులి… మిస్సింగ్ కేసుని సిబిఐ తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఏడేళ్ల వయసు, 250కేజీల బరువున్న జై …గత ఏప్రిల్ లో మహారాష్ట్రలోని ఓ వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపించకుండా పోయింది. జైని వెతికి పట్టుకునే పనిని సిబిఐకి అప్పగించమని తాము ప్రధానికి లేఖ రాయనున్నామని మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి ముంగన్ తివార్ తెలిపారు. జై కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనికి ప్రసిద్ధ బాలివుడ్ సినిమా షోలేలో అమితాబ్ పాత్ర పేరుని పెట్టారు. ఇది మూడేళ్ల క్రితం తన జోడీని వెతుక్కుంటూ గ్రామాలు, నదులు, హైవే రోడ్లు దాటుకుంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వార్తల్లోకి ఎక్కింది. దీని ఆచూకీ కోసం ఇప్పుడు అక్కడి స్థానికులు ప్రార్థనలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుండి పార్లమెంటుకి వెళ్లిన నానా పటోల్ సైతం ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని దృష్టికి తీసుకువెళతానని అన్నారు. అయితే విచిత్రమేమిటంటే జైతో పాటు దాని తాత రాష్ట్రపతి, తండ్రి డెండు, తోబుట్టువు వీరు కూడా అదృశ్యమయ్యాయి.
ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలవారు జై కోసం గాలిస్తుండగా…దీన్ని పట్టుకున్నవారికి మహారాష్ట్ర ప్రభుత్వం 50వేల రూపాయల బహుమతి ప్రకటించింది. జై 20 పిల్లలకు తండ్రి అయిందని, టూరిస్టులను ఆకర్షిస్తూ ఆదాయం పెంచుతున్నదని పర్యావరణ పరిరక్షణ కార్యకర్త రోహిత్ కరూ అన్నారు. ఇది మరొక పులితో పోరాడి గాయపడిందని, వేటగాళ్ల చేతికి చిక్కి ఉంటుందని…లాంటి పుకార్లు వినబడుతుండగా అటవీశాఖ అధికారులు ఎలాగైనా జైని దొరికించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.