వీరి మెడపై వేలాడుతోంది కత్తి...కాచుకున్నారు కొందరు పొంచి...
అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమి కథనాన్ని ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, శిద్దారాఘవరావు, మృణాళిని, కొల్లు రవీంద్ర స్థానాలకు ఎసరు తప్పకపోవచ్చు అని వెల్లడించింది. అదే సమయంలో లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమైందని కథనం. రిస్క్‌లో ఉన్నమంత్రుల్లో ఒకరి భార్య జిల్లాలో చక్రం తిప్పుతుండడం, ఆమెపై అనేక ఆరోపణలు రావడం వల్ల సదరు మంత్రికి ఇబ్బంది […]
అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ప్రముఖ దినపత్రిక ఆంధ్రభూమి కథనాన్ని ప్రచురించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, శిద్దారాఘవరావు, మృణాళిని, కొల్లు రవీంద్ర స్థానాలకు ఎసరు తప్పకపోవచ్చు అని వెల్లడించింది. అదే సమయంలో లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమైందని కథనం. రిస్క్‌లో ఉన్నమంత్రుల్లో ఒకరి భార్య జిల్లాలో చక్రం తిప్పుతుండడం, ఆమెపై అనేక ఆరోపణలు రావడం వల్ల సదరు మంత్రికి ఇబ్బంది తెచ్చిపెడుతోందని పత్రిక వెల్లడించింది. అయితే సదరు మంత్రి పత్తిపాటి పుల్లారావేనని చాలా మంది చెబుతుంటారు. ఒక ఇంటర్వ్యూలో పుల్లారావే తన భార్యపై వచ్చిన ఆరోపణలను స్వయంగా ఖండించారు.
ఇక చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన పరిటాల సునీతకు అదే సామాజికవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ రూపంలో ఇబ్బంది ఎదురుకాబోతోంది. పయ్యావుల ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటే ప్రభుత్వం తరపున గట్టిగా మాట్లాడే వ్యక్తి దొరికినట్టు అవుతుందన్న భావన ఉంది. ప్రతిపక్షానికి అసెంబ్లీలో గానీ, బయట గానీ గట్టిగా కౌంటర్ ఇచ్చే మంత్రుల సంఖ్య తక్కువగా ఉందని పయ్యావులను తీసుకుంటే ఆ కోణంలో కలిసివస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పైగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ చాలా కష్టపడ్డారన్న సానుభూతి పార్టీలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో మంత్రి పదవికి పోటీ వస్తారన్న ఉద్దేశంలో సొంత పార్టీనేతలే ఆయన్ను ఓడించారని చెబుతుంటారు. ఈ లెక్కన కమ్మ సామాజికవర్గానికి చెందిన పుల్లారావు, పరిటాల సునీత తప్పిస్తే ఆ రెండుస్థానాలు లోకేష్, పయ్యావులతో భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.
మృణాళినిని తప్పించి ఆ స్థానంలో ఆమె బావ అయిన ఏపీటీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావుకు అవకాశం ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని పత్రిక కథనం. శిద్దారాఘవరావు జిల్లాలో మిగిలినవర్గాలను సమన్వయం చేసుకోలేకపోతున్నారన్న అసంతృప్తి చంద్రబాబుకు ఉందంటున్నారు. ఆయనను తొలిగించి వైశ్య వర్గానికే చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక రావెల కిషోర్ బాబు పదవి పోవడం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఈయన కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌లో మహిళను చేయి పట్టి లాగిన ఉదంతం , మరో కుమారుడు స్థానిక గల్స్ హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటన కారణంగా ప్రభుత్వానికి బాగా చెడ్డపేరు వచ్చింది. పార్టీ నేతలు ఏం చేసినా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదన్న సంకేతాలు జనంలోకి వెళ్లిపోయాయి. ఒక వేళ రావెలను తప్పిస్తే ఎస్సీ వర్గానికే చెందిన మహిళకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. బొజ్జలను తప్పించి ఆ స్థానంలో ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని గానీ, ఆయన కూతురు, ఫిరాయింపు ఎమ్మెల్యే అఖిల ప్రియకు గానీ అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటున్నారు. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న సోమిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈసారి తమకు పదవి ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు.
ఫిరాయింపు భూమాకు ప్రాధాన్యత ఇస్తారని… పార్టీ విదేయత ఆధారంగా సోమిరెడ్డి, మోదుగులకు అవకాశం ఇస్తారో చూడాలి. మైనార్టీల నుంచి టీడీపీ తరపున మొన్నటి ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారులైన చాంద్ బాషా,జలీల్ ఖాన్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం దక్కవచ్చంటున్నారు. మొత్తం మీద పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు పేర్లు మంత్రుల తొలగింపు జాబితాాలో ప్రముఖంగా ఉన్నాయి.
Click on Image to Read: