అధికార పార్టీలో నయీం కలకలం!
నయీం ఎన్‌కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో.. అంతే మకిలినీ అంటిస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలకు నయీంతో సంబంధాలున్నాయని ఇంతకాలం వస్తోన్న వార్తలు నిజమేనని తేలిపోతోంది. తనను బెదిరించి నయీం ముఠా కోటిరూపాయలు వసూలు చేసిందని, ఇదంతా నేతి విద్యాసాగర్‌రావు (శాసనమండలి వైస్ చైర్మన్)కు కూడా తెలుసని భువనగిరికి చెందిన వ్యాపారి గుంపా నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ ఐ ఆర్‌లో […]
BY sarvi23 Aug 2016 2:30 AM IST
X
sarvi Updated On: 23 Aug 2016 6:42 AM IST
నయీం ఎన్‌కౌంటర్ కేసీఆర్ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో.. అంతే మకిలినీ అంటిస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలకు నయీంతో సంబంధాలున్నాయని ఇంతకాలం వస్తోన్న వార్తలు నిజమేనని తేలిపోతోంది. తనను బెదిరించి నయీం ముఠా కోటిరూపాయలు వసూలు చేసిందని, ఇదంతా నేతి విద్యాసాగర్‌రావు (శాసనమండలి వైస్ చైర్మన్)కు కూడా తెలుసని భువనగిరికి చెందిన వ్యాపారి గుంపా నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ ఐ ఆర్‌లో నేతి విద్యాసాగర్ రావు పేరును ప్రస్తావించారని తెలిసింది. దీంతో నయీం వెనక నల్లగొండ జిల్లా నేతలు ఉన్నారని ఇంతకాలం ఆరోపిస్తూ వస్తోన్న ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికింది.
ఒక రకంగా ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బే! నయీంను తామే మట్టుబెట్టామని.. టీఆర్ ఎస్ జబ్బలు చరుచుకుంటున్న వేళ.. నయీంతో అధికార పార్టీకే చెందిన నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ ఫిర్యాదులు వస్తుండటంతో ఉలిక్కి పడుతోంది. మొన్నటికి మొన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కు నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ.. సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అలాంటి వాడిని కాదని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నయీంతో సంబంధాలున్నాయంటూ ఓ ఆంగ్లఛానల్‌లో తన పేరును ప్రస్తావించారంటూ టీడీపీ నేత ఉమా మాధవరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి కన్నీళ్ల పర్యంత మయ్యారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకోకుంటే తనను నయీం చంపేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. అధికార పార్టీలో 99 శాతం మంది నయీంకు అనుచరులుగానే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశాడు. మరి నేతి విద్యాసాగర్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి కరంగా మారింది. బాద్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన కు నేరుగా నయీంతో సంబంధాలున్నాయని ఆరోపణలు వస్తోన్న వేళ.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story