కోడెల మనుషులనే అడ్డుకుంటావా?- పోలీసులపై చెప్పులతో దాడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తులుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కోడెల శివరామ్, అనుచరులు నిలుస్తున్నారు. కోడెల పవిత్రమైన స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు చేస్తున్న ఆగడాలకు హద్దూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కోడెల అనుచరులు ఏకంగా పోలీసులనే అందరూ చూస్తుండగానే చెప్పులతో కొట్టారు. గుంటూరు జిల్లా పెనుమూడి ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. పెనుమూడి-పులిగడ్డ వారధి సమీపంలో పుష్కరఘాట్లకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా అక్కడే కోడెల అనుచరుల […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తులుగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు కోడెల శివరామ్, అనుచరులు నిలుస్తున్నారు. కోడెల పవిత్రమైన స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు చేస్తున్న ఆగడాలకు హద్దూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కోడెల అనుచరులు ఏకంగా పోలీసులనే అందరూ చూస్తుండగానే చెప్పులతో కొట్టారు. గుంటూరు జిల్లా పెనుమూడి ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. పెనుమూడి-పులిగడ్డ వారధి సమీపంలో పుష్కరఘాట్లకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా అక్కడే కోడెల అనుచరుల వాహనాలను ఆపారు. భక్తులకు ఇబ్బంది అవుతుందని వాహనాలను పక్కకు తీయాలని డ్యూటీలో ఉన్న పోలీసులు సూచించారు. అయితే వారు లెక్కచేయలేదు. ఈ సమయంలో వాగ్వాదం జరిగింది.
ఇంతలోనే కోడెల శివప్రసాద్ అనుచరులు రెచ్చిపోయారు. ”కోడెల అనుచరులం అని చెప్పిన తర్వాత కూడా వాహనాలు పక్కన పెట్టమంటారా” అంటూ అందరూ చూస్తుండగానే చెప్పులు తీసుకుని ఒక కానిస్టేబుల్‌ను పదేపదే కొట్టారు. విషయం తెలుసుకుని మిగిలిన పోలీసులు రాగా వారిపైనా భౌతికదాడులు చేశారు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో పోలీసులే వెనక్కు తగ్గారు. పోలీసులపై చెప్పులతో దాడి చేసిన వారు సత్తెనపల్లి భృగబండకు చెందిన వారుగా గుర్తించామని రేపల్లె సీఐ. మల్లికార్జున రావు చెప్పారు. దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అనుచరులపై చర్యలు లేకుండా పోలీసు అధికారులపై కోడెల వారు అప్పుడే ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు.
Click on Image to Read: