Telugu Global
Cinema & Entertainment

డైలాగ్ లీక్ చేసిన వీవీ వినాయక్

నిన్నంతా చిరంజీవి హంగామా నడిచింది. అభిమానులకు కనిపించకుండా చిరు అజ్ఞాత ప్రదేశానికి వెళ్లిపోయినప్పటికీ… ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ బర్త్ డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. శిల్పకళావేదికలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెగా హీరోలు పాల్గొన్నారు. ఇదే వేడుకలో పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్… చిరు కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. చిరు నటిస్తున్న 150వ సినిమా ఖైదీ నంబర్-150కు దర్శకత్వం వహిస్తున్న వినాయక్… అందులోని ఓ డైలాగ్ ను రిలీవ్ […]

డైలాగ్ లీక్ చేసిన వీవీ వినాయక్
X

నిన్నంతా చిరంజీవి హంగామా నడిచింది. అభిమానులకు కనిపించకుండా చిరు అజ్ఞాత ప్రదేశానికి వెళ్లిపోయినప్పటికీ… ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ బర్త్ డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. శిల్పకళావేదికలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెగా హీరోలు పాల్గొన్నారు. ఇదే వేడుకలో పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్… చిరు కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.

చిరు నటిస్తున్న 150వ సినిమా ఖైదీ నంబర్-150కు దర్శకత్వం వహిస్తున్న వినాయక్… అందులోని ఓ డైలాగ్ ను రిలీవ్ చేశాడు. పరుచూరి బ్రదర్స్ రాస్తున్న డైలాగ్స్ లో ఒకదాన్ని వినాయక్ బయటపెట్టాడు. “పొగరు నా ఒంట్లో ఉంటుంది… హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది” అనే డైలాగ్ ను వినాయక్ చెప్పిన వెంటనే.. ఆడిటోరియం మారుమోగిపోయింది. ఇలాంటివి చాలా డైలాగులు ఖైదీనంబర్-150లో ఉంటాయని వినాయక్ స్పష్టంచేశాడు. దీంతో అభిమానులు ఓ రేంజ్ లో గోల చేశారు. అయితే సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చెప్పిన వినాయక్… ఖైదీ నంబర్-150 విడుదల తేదీని మాత్రం కచ్చితంగా చెప్పలేకపోయాడు. మరో 2 నెలలు గడిచిన తర్వాత మాత్రమే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు.

First Published:  23 Aug 2016 5:24 AM IST
Next Story