ఏపీలో కనిపించని నయీం వార్తలు!
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం వార్తలు ఏపీలోని ప్రధాన పత్రికల్లో కనిపించడం లేదు. ఉమ్మడి ఏపీలోనే నయీం మాఫియాడాన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే! నయీం ఎన్‌కౌంటర్ అయిన తరువాత రెండుమూడు రోజులపాటు ఏపీలోనూ ఈ వార్త హడావుడి చేసింది. రెండురోజులు కాగానే చంద్రబాబు నాయుడు హయాంలోనే నయాం గ్యాంగ్‌స్టర్‌గా మారాడని టీఆర్ ఎస్ – వైసీపీ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెదిలే ఆ రెండు పత్రికల్లో ఆంధ్రా ఎడిషన్ లలో […]
BY sarvi22 Aug 2016 1:08 AM GMT
X
sarvi Updated On: 22 Aug 2016 1:58 AM GMT
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీం వార్తలు ఏపీలోని ప్రధాన పత్రికల్లో కనిపించడం లేదు. ఉమ్మడి ఏపీలోనే నయీం మాఫియాడాన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే! నయీం ఎన్‌కౌంటర్ అయిన తరువాత రెండుమూడు రోజులపాటు ఏపీలోనూ ఈ వార్త హడావుడి చేసింది. రెండురోజులు కాగానే చంద్రబాబు నాయుడు హయాంలోనే నయాం గ్యాంగ్‌స్టర్‌గా మారాడని టీఆర్ ఎస్ – వైసీపీ నాయకులు ఆరోపణలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెదిలే ఆ రెండు పత్రికల్లో ఆంధ్రా ఎడిషన్ లలో నయాం వార్త భూతద్దం పెట్టి వెదికినా కానరావడం లేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి కేవలం రెండేళ్లే అవుతోంది. ఇక్కడున్న పత్రికలే అక్కడా ఉన్నాయి. చంద్రబాబు ఏం చేసినా తెలంగాణ ఎడిషన్లలో హడావుడి చేస్తోన్న ఆ రెండు పత్రికలు నయీం కేసు గురించి ఊసెత్తకపోవడం అంతా పక్కా ప్లాన్‌లో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి ఒక్క సాక్షి మాత్రమే నయీం వార్తలను ఎప్పటికప్పుడు ఆంధ్రాలోనూ ప్రచురిస్తోంది.
నయీం సాగించిన అరాచకాలకు బీజం పడింది 1995లోనే.. అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబే ఉన్నాడు. అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన మాజీ మావోయిస్టులు బెల్లి లలిత, ఈదన్న, లాయర్ పురుషోత్తమ్ ఇతర పౌర సంఘాల నేతలను నయీం అత్యంత కిరాతకంగా చంపాడు. 1997 నుంచి నయీం ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. అంటే చిన్న విత్తనంగా ఉన్న నయీం.. ఇంత పెద్ద వటవృక్షంగా మారింది చంద్రబాబు హయాంలోనే! నయీం ఆగడాల గురించి రాయాల్సి వస్తే.. ఆయా ఘటనలకు సంబంధించి అధికారులు, మంత్రులు, సీఎంల పేర్లు ప్రస్తావనకు వస్తాయి. ఇది చంద్రబాబుకు చెడ్డ పేరు తీసుకువస్తుంది. 20ఏళ్లనాటి వైఫల్యాలు యువతలో ఆయనకు చెడ్డపేరు తీసుకువస్తాయన్న ఆందోళనతో ఆ రెండు పత్రికలు నయీం వార్తలను కోస్తా ఆంధ్ర, రాయలసీమలలో అస్సలు ప్రచురించడమే మానేశాయి. మరి చంద్రబాబా మజాకా? ఆరెండు పత్రికలు ఆయనను పొగడటానికే ఉన్నాయని మరోసారి తమ స్వామి భక్తిని చాటుకున్నాయి.
Next Story