బరి తెగించిన స్పీకర్ తనయుడు... రైల్వే ఉద్యోగుల కిడ్నాప్
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేటలో రౌడీరాజ్యం నడుస్తోంది. తండ్రి స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ కోడెలశివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ మాత్రం రెచ్చిపోతున్నారు. మంచి చెడు లేకుండా వీలైనంత సొమ్ము సంపాదించాలన్న లక్ష్యంతోనే కోడెల వారు దూసుకెళ్తున్నారు. తాజాగా తమ దందా మామూళ్లు ఇవ్వలేదంటూ రైల్వే శాఖ పనులను అడ్డుకున్నారు. శివరామ్ అనుచరులు వెళ్లి రైల్వే కాంట్రాక్టర్, కూలీలపై దాడులు చేశారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. రాముపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు జరుగుతున్నాయి. […]
గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేటలో రౌడీరాజ్యం నడుస్తోంది. తండ్రి స్పీకర్ స్థానంలో ఉన్నప్పటికీ కోడెలశివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ మాత్రం రెచ్చిపోతున్నారు. మంచి చెడు లేకుండా వీలైనంత సొమ్ము సంపాదించాలన్న లక్ష్యంతోనే కోడెల వారు దూసుకెళ్తున్నారు. తాజాగా తమ దందా మామూళ్లు ఇవ్వలేదంటూ రైల్వే శాఖ పనులను అడ్డుకున్నారు. శివరామ్ అనుచరులు వెళ్లి రైల్వే కాంట్రాక్టర్, కూలీలపై దాడులు చేశారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. రాముపాలెం మండలం పెదనెమలిపురి గ్రామం వద్ద నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు జరుగుతున్నాయి. ఐదు నెలలుగా పనులు సాగుతున్నాయి. సత్తెనపల్లి, నరసరావుపేటలలో ఏ పని జరిగినా వాటాలు వసూలు చేయడం అలవాటు చేసుకున్న శివరామ్ … రైల్వే పనులపైనా పడ్డారు. రెండు నెలల క్రితమే వాటా డిమాండ్ చేశారు. అయితే రైల్వే కాంట్రాక్టర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆదివారం దాదాపు 35 మంది అనుచరులను పంపించారు.
అలా వెళ్లిన అనుచరులు వెళ్లడం వెళ్లడంతోనే అక్కడ పనిచేస్తున్న కూలీలపై విచక్షణ రహితంగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. కూలీలు, సిబ్బంది సేదతీరేందుకు ఏర్పాటు చేసుకున్న టెంట్లను నేలమట్టం చేశారు. మూడు టిప్పర్ల అద్దాలను రాడ్లతో ధ్వంసం చేశారు. అంతటితో ఆగలేదు. రైల్వే శాఖకు చెందిన డ్రైవర్ కృష్ణ, సూపర్ వైజర్ ఉస్మాన్‌ను అందరి ముందు కర్రలతో కొడుతూ ఈడ్చుకెళ్లారు. తమ వాహనంలో వేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కాసేపు అక్కడున్న కూలీలు భయంతో వణికి పోయారు. పొట్టకూటి కోసం వచ్చిన తమపై దాడులు చేయడం ఏమిటని.. మరీ ఇంత దుర్మార్గంగా పరిస్థితులు ఉన్నాయని తాము భావించలేదంటున్నారు.రైల్వే కాంట్రాక్టర్ వచ్చి కోడెల వారి వాటా సంగతి తేలిస్తే కిడ్నాప్ కు గురైన రైల్వే ఉద్యోగులను వదిలిపెడతానని కోడెల తనయుడు చెబుతున్నారని సమాచారం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో అనేకసార్లు కోడెల బ్యాచ్ భౌతిక దాడులకు తెగబడింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.
Click on Image to Read: