Telugu Global
Cinema & Entertainment

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్

హీరో విశాల్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా మాట్లాడి వారి కోపానికి గురి అయ్యారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో విశాల్ మాట్లాడిన మాటలు విశాల్ కు నిర్మాతలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేలా చేసాయి. ముఖ్యంగా కబాలి నిర్మాత కలైపులి ధాను.. నిర్మాతల మండలి అధ్యక్ష్యుడిగా విశాల్ కు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంసంగా మారింది. విశాల్ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ… […]

నిర్మాతల మండలిని ఘాటుగా విమర్శించిన‌ విశాల్
X

హీరో విశాల్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా మాట్లాడి వారి కోపానికి గురి అయ్యారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో విశాల్ మాట్లాడిన మాటలు విశాల్ కు నిర్మాతలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేలా చేసాయి. ముఖ్యంగా కబాలి నిర్మాత కలైపులి ధాను.. నిర్మాతల మండలి అధ్యక్ష్యుడిగా విశాల్ కు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంసంగా మారింది. విశాల్ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ… నిర్మాతల మండలి కొన్ని బర్నింగ్ ఇష్యూలకు సరిగా స్పందించటం లేదని ఆరోపణలు చేసారు. పైరసీ వంటి విషయాలలో వారు సీరియస్ గా పరిష్కారం వెతకటం లేదని ఘాటుగా విమర్శించారు. పైరసీ వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే నష్టం అనుకుంటే పొరపాటు, పైరసీ ప్రభావంతో సినిమా సరిగా ఆడకపోతే దాని ఎఫెక్ట్ నటీనటులపై,టెక్నీషియన్స్ పై కూడా పడుతుంది అని విశాల్ అన్నారు.

అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పైరసీ విషయమై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. నిర్మాతల రెవిన్యూ పెరగటానికి డిటిహెచ్ రైట్స్ గురించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత డీవిడి రిలీజ్ అయ్యేలా ఎగ్రిమెంట్స్ చేసుకోవాలని చెప్పాడు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి చర్చించకుండా కేవలం అంతా కూర్చుని,కబుర్లు చెప్పుకుంటూ, బోండాం,బజ్జీ తింటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించాడు. అలాగే కౌన్సిల్ లో జనం మారాలని, కొత్త నీరు రావాలని, అప్పుడే బాగుపడుతుందని ఘాటుగా కామెంట్స్ చేసాడు.

Click to Read

బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం బన్నీకి ప్రవాసి రత్న పురస్కారం
First Published:  21 Aug 2016 7:03 AM IST
Next Story