దళిత మహిళని కాల్చి చంపిన ఎగువ కులపు మహిళ....
ఆ జిల్లాలో 5000మంది మహిళలకు తుపాకి లైసెన్సులు! ఉత్తర ప్రదేశ్లోని మెయిన్‌పురి జిల్లాలో ఎగువ కులానికి చెందిన ఒక మహిళ… ఓ దళిత మహిళని కాల్చి చంపేసింది. మనోనా అనే గ్రామంలో శనివారం పట్టపగలు ఈ హత్య చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి… ఆందోళనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నిందితురాలు పూనం టామర్ ఎటా జిల్లా, బర్‌హానీ గ్రామానికి చెందిన మహిళ. ఈమెకు, ఈమె సోదరికి, మేనల్లుడికి తమ తాతల […]
ఆ జిల్లాలో 5000మంది మహిళలకు తుపాకి లైసెన్సులు! ఉత్తర ప్రదేశ్లోని మెయిన్‌పురి జిల్లాలో ఎగువ కులానికి చెందిన ఒక మహిళ… ఓ దళిత మహిళని కాల్చి చంపేసింది. మనోనా అనే గ్రామంలో శనివారం పట్టపగలు ఈ హత్య చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి… ఆందోళనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం నిందితురాలు పూనం టామర్ ఎటా జిల్లా, బర్‌హానీ గ్రామానికి చెందిన మహిళ. ఈమెకు, ఈమె సోదరికి, మేనల్లుడికి తమ తాతల నుండి వచ్చిన భూమి మనోనాలో ఉంది. పూనం సోదరి తన భూమిని సరళాదేవి అనే దళితురాలికి అమ్మింది. ఇది నచ్చని పూనం సరళాదేవితో ఎప్పుడూ గొడవ పెట్టుకుంటూ ఉండేది.
సరళాదేవి తన స్థలంలో నిర్మాణం మొదలుపెట్టడంతో పూనం… మరింతగా గొడవకు దిగి… కోర్టులో కేసుకూడా పెట్టింది. ఈ నేపథ్యంలో పూనం… శనివారం తమ స్థలం వద్దకు వెళ్లి సరళాదేవిని తుపాకితో కాల్చి చంపింది. తరువాత భర్తతో కలిసి పారిపోయింది. ఆమె దేశవాళీ తుపాకితో కాల్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలే దళితులపై దాడులు జరుగుతూ సున్నిత ప్రాంతంగా మారిన మెయిన్‌పురి జిల్లాలో ఈ సంఘటనతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
కొన్ని రోజుల క్రితం ఇక్కడే పది రూపాయలు అప్పు తీర్చలేదని ఒక షాపు యజమాని దళిత జంటని నరికి చంపాడు. మరో ముగ్గురు దళిత యువకులు కూడా ఇదే జిల్లాలో వేరువేరు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మెయిన్ పురి జిల్లాలో దాదాపు 5000 మందికి పైగా మహిళల వద్ద ఆయుధ లైసెన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ జారీ అయిన మొత్తం లైసెన్సుల్లో ఇవి ఐదవ వంతు.