ఒకే కుటుంబం నుండి... ఐదుగురు ఐఎస్‌లో చేరిపోయారు!
ముంబయికి చెందిన అష్ఫాక్ అహ్మద్ అనే వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ధలో చేరాడు. తాను చేరటంతో పాటు తన భార్య, చిన్నపిల్ల అయిన కుమార్తె, ఇద్దరు కజిన్స్ మహమ్మద్ సిరాజ్ (22), ఎజాజ్ రెహమాన్ (30)లను సైతం తీసుకువెళ్లాడు. సిరాజ్ వ్యాపారం చేస్తుండగా, రెహమాన్ వైద్యుడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇలా ఉగ్రవాద సంస్ధలో చేరటం షాక్‌కి గురిచేసిందని, అష్ఫాక్ అహ్మద్‌ని ఐఎస్‌లో చేరేందుకు ప్రోత్సహించిన ట్టుగా భావిస్తున్న మహ్మద్ హనీఫ్ అనే మత […]
ముంబయికి చెందిన అష్ఫాక్ అహ్మద్ అనే వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్ధలో చేరాడు. తాను చేరటంతో పాటు తన భార్య, చిన్నపిల్ల అయిన కుమార్తె, ఇద్దరు కజిన్స్ మహమ్మద్ సిరాజ్ (22), ఎజాజ్ రెహమాన్ (30)లను సైతం తీసుకువెళ్లాడు. సిరాజ్ వ్యాపారం చేస్తుండగా, రెహమాన్ వైద్యుడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇలా ఉగ్రవాద సంస్ధలో చేరటం షాక్‌కి గురిచేసిందని, అష్ఫాక్ అహ్మద్‌ని ఐఎస్‌లో చేరేందుకు ప్రోత్సహించిన ట్టుగా భావిస్తున్న మహ్మద్ హనీఫ్ అనే మత బోధకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
అష్ఫాక్ అహ్మద్, అబ్దుల్ మజీద్ అనే సంపన్న వ్యాపారవేత్త కుమారుడు. వీరికి ముంబయిలో పలు గెస్ట్ హౌసులు ఉన్నాయి. జూన్ చివరి వారంలో అష్ఫాక్ అహ్మద్ తన తమ్ముడికి….ఒక మెసేజ్‌ని పంపాడు. అందులో తాను ఐఎస్‌లో చేరిపోతున్నానని, తిరిగి వచ్చే ప్రసక్తి లేదని… అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకోమని ఉంది. దాంతో అష్ఫాక్ అహ్మద్ తండ్రి అబ్దుల్ మజీద్…తన కుమారుని ఇందుకు ప్రోత్సహించినది హనీఫే నంటూ… అతనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హనీఫ్ తో పాటు అబ్దుల్ రషీద్ అనే కేరళ స్కూలు టీచరు కూడా ఇందుకు కారణమని అబ్దుల్ మజీద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రషీద్ తన కుమారుడితో పాటు మరికొంతమందితో కలిసి సిరియా వెళ్లినట్టుగా అబ్దుల్ మజీద్ తెలిపాడు. తమది బర్వేలీ ముస్లిం తెగకాగా తన కుమారుడు అల్-ఇ-హదీస్ తెగకు మార్పిడి చేసుకున్నాడని, తమకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని అబ్దుల్ మజీద్ పోలీసులకు చెప్పాడు. అష్ఫాక్ తన భార్యని ఆమె ఇష్టపూర్వకంగానే తీసుకువెళ్లాడో లేదా బలవంతంగా తీసుకువెళ్లాడో తెలియటం లేదు. అయితే ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో అష్ఫాక్ అతని భార్య ఇద్దరూ కలిసి మతపరమైన విద్యని అభ్యసించడానికి శ్రీలంక వెళ్లినట్టుగా తెలుస్తోంది.
2014 సంవత్సరం నుండి అష్ఫాక్‌లో మార్పులు వచ్చాయని అతని తండ్రి తెలిపాడు. అతను పాటలు వినటం, టివి చూడటం మానేశాడని, గడ్డం పెంచడంతో పాటు దుస్తుల శైలిని కూడా మార్చాడని అబ్దుల్ మజీద్ చెప్పాడు. కొడుకులో వస్తున్న మార్పులను చూసి తాము ఆందోళన చెందుతూనే ఉన్నామన్నాడు. అష్ఫాక్ తనతో తీసుకువెళ్లిన కజిన్స్ రహమాన్, సిరాజ్‌లతో చాలా సన్నిహితంగా ఉండేవాడని…అందువలన వారు ముగ్గురు ఎక్కువగా మాట్లాడుకుంటున్నా తమకు అనుమానం రాలేదని మజీద్ పేర్కొన్నారు. మతబోధకుడు హనీఫ్ తమ కుమారుడిని ఐఎస్‌లో చేరేందుకు ప్రేరేపించాడని మజీద్ అంటున్నా… అందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.