పక్కదారి పడుతున్న ఎస్. ఐ. ఆత్మహత్య కేసు !
ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక సర్వీసు రివాల్వరుతో ఆత్మహత్య చేసుకున్న ఎస్. ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై విచారణాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎస్.ఐ.ని తాగుబోతుగా వర్ణిస్తూ విచారణాధికారి ఏఎస్పీ ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎస్.ఐ ఆత్మహత్యకేసును పక్కదారి పట్టిస్తున్నారని అప్పుడే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తు చేపట్టాక కేవలం 12 గంటల్లో తాగి మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని ఝాడీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్మీలో పనిచేసే వారెవరైనా మద్యం […]
BY sarvi20 Aug 2016 3:51 AM IST

X
sarvi Updated On: 20 Aug 2016 6:05 AM IST
ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక సర్వీసు రివాల్వరుతో ఆత్మహత్య చేసుకున్న ఎస్. ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై విచారణాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎస్.ఐ.ని తాగుబోతుగా వర్ణిస్తూ విచారణాధికారి ఏఎస్పీ ప్రతాపరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఎస్.ఐ ఆత్మహత్యకేసును పక్కదారి పట్టిస్తున్నారని అప్పుడే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తు చేపట్టాక కేవలం 12 గంటల్లో తాగి మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని ఝాడీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్మీలో పనిచేసే వారెవరైనా మద్యం తాగుతారు. అంత మాత్రాన వారంతా తాగుబోతులనా? అని రామకృష్ణా రెడ్డి బంధువులు మండిపడుతున్నారు.
తన చావుకు కారణం డీఎస్పీ శ్రీధర్ అని ఎస్. ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. విచిత్రంగా అదే అధికారి ఎదుట విచారణ జరపడం ఏంటని విలేకరులు ముక్కున వేలేసుకున్నారు. చనిపోయిన వారిపట్ల కనీస మర్యాద పాటించకుండా… అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆకాశరామన్న ఉత్తారాలు వచ్చాయని ప్రస్తావించారు. తాగిన మైకంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తేల్చేశారు. ఎస్.ఐ రామకృష్ణారెడ్డి పోస్టుమార్టం నివేదిక ఇంకా అందనేలేదు. నివేదిక రాకముందే చనిపోయే ముందు తాగి ఉన్నాడని ముందే ఈయనకు ఎలా తెలిసింది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆత్మహత్య లేఖనే మరణవాంగ్మూలంగా పరిగణించవచ్చని కోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నా.. ఆయన తాగిన మైకంలో రాశాడని, తెలుగు కూడా సరిగా రాయలేకపోయారని ఎస్.ఐపై ఏఎస్పీ ప్రతాపరెడ్డి తీవ్ర నిందారోపణలు చేశారు. డిపార్టుమెంటుకు చెందిన ఎస్.ఐ స్వయంగా రాసిన ఆత్మహత్య లేఖని కాదని, ఎవరో రాసిన ఆకాశరామన్న లేఖ ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం ద్వారా కేసు పక్కదారి పట్టించేందుకేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. నిజంగా రామకృష్ణారెడ్డి ఆరోజు చావలేదని, అతడు పనిచేసిన డిపార్టుమెంటే అతని వ్యక్తిత్వం మీద ఇన్ని నిందలు వేసిన ఈ రోజే నిజంగా మరణించాడని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.
ఎస్.ఐ.గా రామకృష్ణారెడ్డి పనిచేసినంత కాలం కుకునూరుపల్లి పరిధిలో ఎలాంటి బెల్టు షాపులను నడవనీయలేదు. షాపుకు లక్ష రూపాయల చొప్పున ప్రతినెలా చెల్లిస్తామని ముందుకొచ్చినా ఎస్.ఐ వినకుండా వాటిని తెరవనీయలేదు. కానీ, రామకృష్ణారెడ్డి మరణించాడన్న వార్త తెలియగానే.. ఇక్కడి బెల్టుషాపులన్నీ తెరుచుకోవడం గమనార్హం.
Click on Image to Read:
Next Story