అన్నమయ్యకు మసాలా అద్దారా?
వెంకటేశ్వరస్వామి చిత్రాలంటే టక్కున అన్నమయ్య సినిమానే గుర్తుకు వస్తుంది. నాగార్జున అన్నమయ్య పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రజలను తప్పుదోవ పట్టించిందని ప్రముఖ గాయని శోభారాజ్ చెప్పారు. అన్నమయ్య పాత్రతో పాటు సాళువ నరసింహరాయుల పాత్రను తప్పుగా చిత్రీకరించారన్నారు. చక్రవర్తి సాళువ రాయల( మోహన్ బాబు చేసిన పాత్ర)ను హాస్య పాత్రగా చిత్రీకరించారని … దీనితో పాటు అన్నమయ్య ఇద్దరు భార్యల వెంట పడటం […]
వెంకటేశ్వరస్వామి చిత్రాలంటే టక్కున అన్నమయ్య సినిమానే గుర్తుకు వస్తుంది. నాగార్జున అన్నమయ్య పాత్రలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రజలను తప్పుదోవ పట్టించిందని ప్రముఖ గాయని శోభారాజ్ చెప్పారు. అన్నమయ్య పాత్రతో పాటు సాళువ నరసింహరాయుల పాత్రను తప్పుగా చిత్రీకరించారన్నారు. చక్రవర్తి సాళువ రాయల( మోహన్ బాబు చేసిన పాత్ర)ను హాస్య పాత్రగా చిత్రీకరించారని … దీనితో పాటు అన్నమయ్య ఇద్దరు భార్యల వెంట పడటం వంటివన్నీ అవాస్తవం అని అన్నారు. ఈ రెండు పాత్రల చిత్రీకరణతో తప్పుదారి పట్టించారన్నారు. తాను అన్నమయ్య జీవితంపై అధ్యయనం చేశానని శోభారాజ్ చెప్పారు. అన్నమయ్య సినిమా విషయంలోనే కాదు… ఇది వరకు అనేక పురాణ చిత్రాల్లోనూ లేనిపోనివి జోడించి సినిమాలు తీసిన చరిత్ర తెలుగు చిత్రపరిశ్రమకు ఉంది. నెగిటివ్ క్యారెక్టర్లను కూడా హీరోయిజంగా చూపించడం, కమర్షియల్ ఎలిమెంట్ పేరుతో మసాలా దట్టించడం జరుగుతూనే ఉంది. ఇక అన్నమయ్య దర్శకుడు ముందే రాఘవేంద్రరావు. ఆయనకు పండ్లు, పుష్పాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు అందుకే మీసాల అన్నమయ్యను తెలుగు తెరకు ఎక్కించాడు అని కొందరు ఈ చిత్రం విడుదల అయినప్పుడే విమర్శించారు.
Click on Image to Read: