బాబును మించి భారీ నజరానా ప్రకటించిన కేసీఆర్
రియోలో సిల్వర్ పతకం సాధించిన సింధుకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. సింధుకు రూ. 5కోట్ల నగదు పురస్కారం ఇస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగం చేసేందుకు సింధు సిద్ధపడితే ఆమె అర్హతకు తగ్గట్టు ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో వెయ్యి గజాల స్థలం ఇస్తామన్నారు. హైదరాబాద్ వస్తున్న సింధుకు ప్రభుత్వం తరపున ఘనస్వాగతం పలుకుతామన్నారు. కోచ్ గోపిచంద్‌కు కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. కాంస్య పతకం సాధించిన […]

రియోలో సిల్వర్ పతకం సాధించిన సింధుకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. సింధుకు రూ. 5కోట్ల నగదు పురస్కారం ఇస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగం చేసేందుకు సింధు సిద్ధపడితే ఆమె అర్హతకు తగ్గట్టు ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో వెయ్యి గజాల స్థలం ఇస్తామన్నారు. హైదరాబాద్ వస్తున్న సింధుకు ప్రభుత్వం తరపున ఘనస్వాగతం పలుకుతామన్నారు. కోచ్ గోపిచంద్‌కు కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌కు కోటి రూపాయలు ఇస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.
సింధుకు ఏపీ ప్రభుత్వం రూ. 3కోట్ల నగదు బహుమతి, సీఆర్డీఏలో వెయ్యి గజాల స్థలం ఇస్తున్నట్టు ప్రకటించింది. కోచ్ గోపిచంద్ కు అర కోటి నగదు బహుమతిని చంద్రబాబు ప్రకటించారు.
Click on Image to Read: