ఏటీఎం కెమెరాల్లో దొరికిన... డీఎస్పీ లంచావతారం!
ఎంసెట్-2 పేపర్ లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసు అధికారే డబ్బులకు కక్కుర్తి పడి విధుల నుంచి బహిష్కరణకు గురైన సంఘటన ఇది. అరెస్టులు చేయకుండా ఆపినందుకుగాను నిందితుల నుంచి రూ.3 లక్షలు బేరం కుదుర్చుకున్న వరంగల్ సీఐడీ డీఎస్పీ బాలూ జాదవ్ , అతనికి సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ సదాశివరావులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరువుకు మచ్చ తెచ్చిన ఎంసెట్ లీకేజీ వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈకేసు విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. […]
BY sarvi20 Aug 2016 1:31 AM IST
X
sarvi Updated On: 20 Aug 2016 6:54 AM IST
ఎంసెట్-2 పేపర్ లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసు అధికారే డబ్బులకు కక్కుర్తి పడి విధుల నుంచి బహిష్కరణకు గురైన సంఘటన ఇది. అరెస్టులు చేయకుండా ఆపినందుకుగాను నిందితుల నుంచి రూ.3 లక్షలు బేరం కుదుర్చుకున్న వరంగల్ సీఐడీ డీఎస్పీ బాలూ జాదవ్ , అతనికి సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ సదాశివరావులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరువుకు మచ్చ తెచ్చిన ఎంసెట్ లీకేజీ వ్యవహారం కావడంతో ప్రభుత్వం ఈకేసు విచారణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసు విచారణలో ఓ బృందానికి డీఎస్పీ బాలూ జాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. మొదటి నుంచి బాలూ వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తన గురించి మీడియాకు మంచిగా చెప్పాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాడని, లీకేజీ నిందితులతో ఫోన్లో మాట్లాడుతూ.. బెయిల్ తీసుకోవాలని సలహాలు ఇస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి.
కేసు విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరిగా ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావును అరెస్టు చేయాలని ఉన్నతాధికాలు బాలూ జాదవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ సదాశివరావులతో కలిసి వెంకటేశ్వరరావును అరెస్టు చేసేందుకు విజయవాడ వెళ్లిన జాదవ్ అక్కడ బేరానికి దిగాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే.. రూ. 3లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వెంకటేశ్వరరావు ఇచ్చిన ఏటీఎం కార్డుతో రూ.1.5 లక్షలు డ్రా చేసుకున్నారు. నిందితుని ఏటీఎం నుంచి భారీ ఎత్తున డబ్బు విత్‌డ్రా కావడంతో వెంటనే సీఐడీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజీలు తెప్పించుకుని చూసిన అధికారులు అందులో డీఎస్పీ, హెడ్‌కానిస్టేబుల్‌ని చూసి కంగుతిన్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని డీఎస్పీ బాలూ జాదవ్ , అతనికి సహకరించిన హెడ్‌కానిస్టేబుల్ సదాశివరావులను సస్పెండ్ చేశారు.
Click on Image to Read:
Next Story