చివరికి నన్ను పట్టుకున్నారు...కంగ్రాట్స్.....పోలీసులకు నేరస్తుడి అభినందనలు!
మహారాష్ట్ర స్థానిక మీడియాలో డాక్టర్ డెత్‌గా ప్రాచుర్యం పొందిన సీరియల్ కిల్లర్ సంతోష్పాల్ తనని అరెస్టు చేసినందుకు పోలీసులను అభినందించాడు. సతారా జిల్లా పోలీసులకు అతను ఈ మేరకు ఒక లేఖ పంపాడు. 2003 నుండి 2016 వరకు కనీసం ఆరు హత్యలు చేశాడని భావిస్తున్న సంతోష్పాల్ తన చేతిరాతతో… అభినందనలు తెలుపుతూ రాసిన లేఖని ఎస్పి సందీప్ పాటిల్‌కి పంపాడు. ఎందుకు ఇన్ని హత్యలు చేశావు… అని నన్ను కారణం అడగటం కంటే మీ డిపార్ట్మెంట్లో […]
మహారాష్ట్ర స్థానిక మీడియాలో డాక్టర్ డెత్‌గా ప్రాచుర్యం పొందిన సీరియల్ కిల్లర్ సంతోష్పాల్ తనని అరెస్టు చేసినందుకు పోలీసులను అభినందించాడు. సతారా జిల్లా పోలీసులకు అతను ఈ మేరకు ఒక లేఖ పంపాడు. 2003 నుండి 2016 వరకు కనీసం ఆరు హత్యలు చేశాడని భావిస్తున్న సంతోష్పాల్ తన చేతిరాతతో… అభినందనలు తెలుపుతూ రాసిన లేఖని ఎస్పి సందీప్ పాటిల్‌కి పంపాడు. ఎందుకు ఇన్ని హత్యలు చేశావు… అని నన్ను కారణం అడగటం కంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతి అధికారులకే ఈ ప్రశ్నని వేస్తే మంచిదని పాల్ అందులో రాశాడు. అయితే అతను రాసిన దాన్ని బట్టి…పోలీసుల అవినీతి వల్లనే తనను వారు పట్టుకోలేకపోయారని అతను భావిస్తున్నాడని, ఇది అతని అతి తెలివితేటలకు, మోసపూరిత మనస్తత్వానికి నిదర్శనమని పాటిల్ అన్నారు.
పాల్ పోలీసుల ఇంటరాగేషన్‌లో హత్యలన్నీ తానే చేశానని ఒప్పుకున్నాడు. పాల్ గతంలో పోలీసులతో మంచిగా ఉండి ఆ తరువాత యాంటీ కరప్షన్ అధికారులకు పట్టించేవాడని, బ్లాక్ మెయిల్ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. అతని ప్రవర్తన అర్థం కావటంతో పోలీసులు అతనికి దూరంగా ఉంటూ వచ్చారని ఒక అధికారి తెలిపాడు. సంతోష్పాల్ మొత్తం అయిదుగురు మహిళలను, ఒక పురుషుడిని హత్యచేసి తన ఫాం హౌస్‌లోనే పూడ్చి పెట్టాడు. అతను వైద్యుడు కావటంతో ప్రాణాంతక ఇంజక్షన్లు చేసి బాధితులను హతమార్చాడు.
ఈ హత్యలన్నింటి వెనుక అక్రమ సంబంధాలు, దోపిడి, సాక్షిగా మారి తన గురించి బయటపెడతారనే భయం… కారణాలుగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. జూన్ 12న మంగళా జెథే అనే మహిళ హత్యకేసులో ఆమె ఫోన్ నెంబర్ల ఆధారంగా పాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు…అతను మరో అయిదు హత్యలు చేశానని చెప్పటంతో షాక్‌కి గురయ్యారు. ఇప్పుడు వారిని అభినందించి మరోసారి షాక్‌కి గురిచేశాడు.