ఎలుకలకు వణుకుతున్న రైల్వేశాఖ...వదిలించుకోవడానికి లక్షల ఖర్చు!
భారత రైల్వేశాఖ ఎలుకలను వదిలించుకోలేక తిప్పలు పడుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఎలుకల బాధ తప్పించుకోవడానికి… నెలకు 35వేల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఎలుకలు ప్లాట్ఫామ్ కింద తవ్వేస్తుండటంతో రైల్వే అధికారులు వాటిని పట్టుకునే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. ఈ పనికి రైల్వే శాఖ 4.76లక్షల రూపాయలు చెల్లించనుంది. రైల్వే ఆస్తులకు, ఫైల్స్కి, ప్రయాణీకుల ఆస్తులకు ఇవి నష్టం కలిగిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇంతకుముందు 2013లో కూడా ఒకసారి […]
భారత రైల్వేశాఖ ఎలుకలను వదిలించుకోలేక తిప్పలు పడుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఎలుకల బాధ తప్పించుకోవడానికి… నెలకు 35వేల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఎలుకలు ప్లాట్ఫామ్ కింద తవ్వేస్తుండటంతో రైల్వే అధికారులు వాటిని పట్టుకునే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి అప్పగించారు. ఈ పనికి రైల్వే శాఖ 4.76లక్షల రూపాయలు చెల్లించనుంది.
రైల్వే ఆస్తులకు, ఫైల్స్కి, ప్రయాణీకుల ఆస్తులకు ఇవి నష్టం కలిగిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఇంతకుముందు 2013లో కూడా ఒకసారి ఎలుకలను పట్టుకునే పనిని ఒక కంపెనీకి ఇవ్వగా ఆ కంపెనీ సవ్యంగా ఆ పనిని పూర్తిచేయలేకపోయింది. గత ఏడాది ఎలుకలు ప్లాట్ఫామ్, ఆఫీసు గదుల్లో హల్చల్ చేసి…సరుకులను తినేసి వ్యాపారులకు 10లక్షల రూపాయల వరకు నష్టం కలిగించాయి. అంతేకాదు, ఇవి క్లాక్ రూముల్లో భద్రపరుస్తున్న ప్రయాణీకుల బ్యాగులను సైతం కొరికేస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇక రికార్డు రూముల్లో భద్రపరచిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అవి కొరికేస్తుండటంతో సిబ్బంది…ఆ పేపర్లను ఏరుకుని, అతికించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా ఎలుకలను చంపే పనిని ఒక ప్రయివేటు కంపెనీకి ఇచ్చామని, ఇంత టార్గెట్ అని లేకపోయినా ఎన్ని ఎలుకలు చనిపోయాయి అనేది..చార్బాగ్ రైల్వే స్టేషన్ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ చూస్తారని అధికారులు తెలిపారు. సంవత్సరం పాటు ఆ కంపెనీ రైల్వే స్టేషన్ అంతటా ఎలుకలను పట్టుకుని చంపాల్సి ఉంటుంది. ఈ సంవత్సరకాలంలో 25సార్లు వారు ఎలుకలను పట్టుకునే పనిని నిర్వర్తిస్తారు. ఇందుకు వారికి రూ. 4,76,525 చెల్లిస్తారు.
ఒక్కో ఎలుక అరకేజి కంటే ఎక్కువ బరువు ఉండి, పిల్లలను భయపెడుతున్నాయని, అప్రమత్తంగా లేకపోతే కాళ్లను కొరికిపోతున్నాయని ఒక రోజువారీ ప్రయాణికుడు వెల్లడించాడు. ఎలుకలను చంపడానికి సదరు కంపెనీ….ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన పదార్థాలను వినియోగించనుంది.