ఫైనల్‌లో ఓడిన సింధు
రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధు ఓడిపోయింది. తొలినుంచి హోరాహోరీగా పోరాడినప్పటికీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ అనుభవం ముందు ఫలితం లేకపోయింది. రజతపతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది. తొలి గేమ్ లో ఓ దశలో మారిన్ […]
రియో ఒలింపిక్స్ ఫైనల్‌లో సింధు ఓడిపోయింది. తొలినుంచి హోరాహోరీగా పోరాడినప్పటికీ వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ అనుభవం ముందు ఫలితం లేకపోయింది. రజతపతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. అయితే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తొలి భారత షట్లర్గా సింధు రికార్డు నెలకొల్పింది.
తొలి గేమ్ లో ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ సమయంలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం మారిన్ చెలరేగిపోయింది. సింధు గట్టి పోటీ ఇస్తున్నా స్కోర్ పట్టికలో మారిన్‌దే పైచేయిగా నిలుస్తూ వచ్చింది.