ఓటమికి కారణం అదేనా?
వరల్డ్ నెంబర్ వన్ మారిన్‌కు చుక్కలు చూపించిన సింధు చివరకు ఓటమి పాలవడానికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సింధు ఆట విషయంలో మరింత మెరుగుపడాల్సి ఉందంటున్నారు. మైదానంలో కదిలే విషయంలోనూ మరింత చురుకుదనం అవసరం అంటున్నారు. మారిన్ గ్రౌండ్‌లో పాదరసంలా కదులుతుంటే సింధు మాత్రం కాస్త ఇబ్బందిపడిందని అభిప్రాయపడుతున్నారు. సెకండ్ సెట్‌లో సింధు ఓటమికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. సింధు ఇబ్బందిపడుతున్న విషయాన్ని గమనించే మారిన్ తన అనుభవంతో ప్రత్యర్థిని గ్రౌండ్ మొత్తం తిరిగేలా […]
వరల్డ్ నెంబర్ వన్ మారిన్‌కు చుక్కలు చూపించిన సింధు చివరకు ఓటమి పాలవడానికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సింధు ఆట విషయంలో మరింత మెరుగుపడాల్సి ఉందంటున్నారు. మైదానంలో కదిలే విషయంలోనూ మరింత చురుకుదనం అవసరం అంటున్నారు. మారిన్ గ్రౌండ్‌లో పాదరసంలా కదులుతుంటే సింధు మాత్రం కాస్త ఇబ్బందిపడిందని అభిప్రాయపడుతున్నారు. సెకండ్ సెట్‌లో సింధు ఓటమికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు.
సింధు ఇబ్బందిపడుతున్న విషయాన్ని గమనించే మారిన్ తన అనుభవంతో ప్రత్యర్థిని గ్రౌండ్ మొత్తం తిరిగేలా షాట్స్ కొట్టిందంటున్నారు. దీంతో సింధు మరింత అలసిపోయేందుకు అవకాశం ఏర్పడిందంటున్నారు. ఏదీ ఏమైనా వరల్డ్ నెంబర్ వన్ మారిన్‌కు సింధు చెమటలు పట్టించిన తీరు మాత్రం అద్భుతమని అభిప్రాయపడుతున్నారు. సింధు భారత్‌కు మొదటి రజత పతకం అందించిన మహిళగా రికార్డులకెక్కింది.
మరో వైపు రజత పతకం సాధించిన సింధుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ రూ. 50 లక్షల నగదు పురస్కారం ప్రకటించారు. టీవీ ద్వారా ఆయన స్వయంగా మ్యాచ్‌ను వీక్షించారు. సింధు ఆటతీరు అద్భుతంగా ఉందని కీర్తించారు.
Click on Image to Read: