పేరుకి ప్రపంచ వారసత్వ సంపద.......కరెంటు బిల్లులు కట్టే దిక్కులేదు!
తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయం, పర్యాటక ప్రదేశం మహా బలిపురానికి యునెస్కోవారి ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు ఉంది. తమిళనాడు టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి పరచాలని ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలోనే సముద్రపు ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రాంతంలో ఫ్లడ్ లైట్స్‌ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు తరువాత కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా , ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవారికి ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాలను […]
తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయం, పర్యాటక ప్రదేశం మహా బలిపురానికి యునెస్కోవారి ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపు ఉంది. తమిళనాడు టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ కూడా ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి పరచాలని ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలోనే సముద్రపు ఒడ్డున ఉన్న ఈ ఆలయ ప్రాంతంలో ఫ్లడ్ లైట్స్‌ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు తరువాత కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా , ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవారికి ఏ సమయంలోనైనా ఈ ప్రాంతాలను చూసే వీలు ఉంటుందని లైట్లను ఏర్పాటుచేశారు. అయితే ఈ లైటింగ్‌ని ఏర్పాటు చేసినపుడు తమిళనాడు టూరిజం శాఖకు, కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో…ప్రాచీన నిర్మాణాలపై పరిశోధన రక్షణ విషయాల్లో పనిచేసే ఆర్కియాలజీ సర్వే శాఖకు మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు.
దాంతో ఆలయ విద్యుదీకరణకు సంబంధించిన నిర్వహణ ఖర్చులు, బిల్లులు ఎవరు చెల్లించాలనే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే ఈ రెండు సంస్థల మధ్య సమన్వయం లోపించింది. రెండు సంస్థలు ఎవరికి వారు పట్టనట్టుగా ఊరుకోవటంతో ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలగటం లేదు. కరెంటు బిల్లులు మోత మోగిపోతుండటంతో వీటిని ఆపేశారు. తమిళనాడు టూరిజం శాఖకు, కేంద్ర ప్రభుత్వపు ఆర్కియాలజీ సర్వే శాఖకు మధ్య ఒక ఒప్పందం అంటూ కుదిరితే కానీ.. ఇవి వెలిగే పరిస్థితి లేదని కేంద్ర ఆర్కియాలజీ సర్వే డిపార్ట్‌మెంట్ తమిళనాడు విభాగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. ఇదే కాకుండా పంచ రథాల ప్రాంతంలో….చూడాల్సిన ప్రదేశానికి 200 మీటర్ల దూరంలో ఉన్న టికెట్ కౌంటర్‌ని… సందర్శన ప్రాంతానికి దగ్గరగా మార్చాలని అక్కడి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. సందర్శకులు అక్కడి వరకు వచ్చేసి…టికెట్ కోసం 200 మీటర్లు నడిచి వెళుతున్నారని, ఇది చాలా అసౌకర్యంగా ఉందని వారు చెబుతున్నారు.