Telugu Global
Cinema & Entertainment

"ఆటాడుకుందాం రా" సినిమా రివ్యూ

రేటింగ్:   2/5 దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, ఏ. నాగ సుశీల సంగీతం : అనూప్ రూబెన్స్ నటీనటులు : సుశాంత్, సోనమ్ భజ్వా.., ముర‌ళి శ‌ర్మ‌,  ఆనంద్,  పృధ్వీ,  బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌, అక్కినేని ఫ్యామిలి నుంచి వ‌చ్చిన కుర్ర హీరోల్లో సుశాంత్  ఒక‌డు. క‌రెంట్  , కాళిదాసు , అడ్డా చిత్రాలు చేసి  త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను ఎస్టాబ్లీష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. […]

ఆటాడుకుందాం రా సినిమా రివ్యూ
X

రేటింగ్: 2/5
దర్శకత్వం : జి. నాగేశ్వర్ రెడ్డి
నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, ఏ. నాగ సుశీల
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : సుశాంత్, సోనమ్ భజ్వా.., ముర‌ళి శ‌ర్మ‌, ఆనంద్, పృధ్వీ, బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌,

అక్కినేని ఫ్యామిలి నుంచి వ‌చ్చిన కుర్ర హీరోల్లో సుశాంత్ ఒక‌డు. క‌రెంట్ , కాళిదాసు , అడ్డా చిత్రాలు చేసి త‌న‌కంటూ ఒక ఇమేజ్ ను ఎస్టాబ్లీష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ.. ఇంత వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. అయితే ఈ సారి న్యూలుక్.. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ తో ఆటాడుకుందాం రా అంటూ వ‌చ్చాడు. ఈ చిత్ర‌మైనా మ‌నోడికి హిట్ ఇస్తుందా..? అవ‌కాశం ఉందా..? ఆ విశేషాల‌న్నీ ఈ చిత్ర స‌మీక్ష‌లో చూసేద్దాం…

కథ :
మాన‌వ సంబంధాల్లో స్నేహం అత్యంత ప్రధానమైన అంశం. ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌రెడ్డి ఆటాడుకుందాం రా మూవీ మెయిన్ ప్లాట్ ను దీని చుట్టూ అల్లుకున్నాడు. క‌థ ప‌రంగా చూస్తే.. విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్ (ఆనంద్) మంచి స్నేహితులు. ఆనంద్ ఇచ్చే సలహాలతో వ్యాపారంలో విజయరామ్ కోట్లు గడిస్తాడు. అయితే విజయరామ్‌కు శత్రువైన శాంతారామ్ అతడి సక్సెస్‌ను చూసి తట్టుకోలేక దొంగ దెబ్బతీస్తాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో శాంతారామ్ చేసిన మోసం ఆనంద్‌పై పడుతుంది. దీంతో విజయరామ్, ఆనంద్ ఇద్దరూ విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత కూడా కష్టాల్లో ఉన్న విజయరామ్ కుటుంబాన్ని శాంతారామ్ ఏదోరకంగా హింసిస్తూనే ఉంటాడు.ఈ స‌మ‌యంలో విజ‌య్ రామ్ సోదరుడి కూతురుడి పెళ్లి కుదురుతుంది. పెళ్లి ఖ‌ర్చుల కోసం త‌న జీవాన‌ధార‌మైన రైస్ మిల్లును అమ్మ‌కానికి పెడ‌తారు. అయితే ఆ మిల్లు అమ్మాలంటే త‌న సోద‌రి సంత‌కం కూడా అవ‌స‌రం అవుతుంది. మ్యారేజ్ విష‌యంలో అన్న‌య్య విజ‌య్ రామ్ కు ఇష్టం లేని పెళ్లి చేసుకుంద‌ని చెల్లితో సంవత్స‌రాల త‌ర‌బ‌డి మాట‌లు లేకుండా ఉంటాడు. అయితే రైస్ మిల్లు అమ్మాలంటే.. త‌న సంత‌కం కూడా అవ‌స‌రం కాబ‌ట్టి.. త‌న చిన్న త‌మ్ముడు ఆమెకు ఫోన్ చేసి విష‌యం చెబుతాడు. త‌ను రావ‌డానికి కుద‌ర‌ద‌ని..త‌న కొడుకు వ‌స్తాడ‌ని చెబుతుంది. అంటే విజ‌య్ రామ్ మేన‌ల్లుడు. ఆ ప్లేస్ లో హీరో సుశాంత్ విజ‌య్ రామ్ ఇంట్లో ఎంట‌ర్ అయ్యి ఏం చేశాడు..? పెళ్లి జ‌రిపించాడా..? రైస్ మిల్లును అమ్మ‌కుండా ఎందుకు అడ్డు ప‌డ‌తాడు..? సుశాంత్ తండ్రి కోసం ఏం చేశాడు.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఆటాడుకుందాం రా చిత్ర క‌థ‌.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఉన్నంతలో మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫస్టాఫ్‌లో పృథ్వీ, సుశాంత్‌ల మధ్యన వచ్చే కామెడీ అని చెప్పుకోవాలి. ఇక కథతో ఏమాత్రం సంబంధం లేకున్నా టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కామెడీ అక్కడక్కడా నవ్వించింది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెల్ని అంటూ వచ్చే ఝాన్సీ కామెడీ ఆకట్టుకుంది. పోసాని కృష్ణమురళి కామెడీ ఫర్వాలేదనేలా ఉంది. నాగ చైతన్య స్పెషల్ ఎంట్రీ కథకు కనెక్ట్ అయ్యేది కావడం కూడా బాగానే ఉంది. హీరో సుశాంత్ జస్ట్ చిల్ అంటూ సరదాగా సాగిపోయే పాత్రలో బాగానే నటించాడు. కమర్షియల్ హీరో చేసే డ్యాన్సులు, ఫైట్స్.. అన్నీ చేయగలనని సుశాంత్ ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక సోనమ్ భజ్వా నటన పరంగా ఫర్వాలేదనిపించినా, పాటల్లో అందాల ప్రదర్శన చేసింది. ఈ అంశాలను కోరేవారికి ఇది ప్లస్‌పాయింట్‌గానే చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే తెలుగు సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన పక్కా ఫార్ములా కథను ఎంచుకోవడమనే చెప్పాలి. దానికితోడు ఆ ఫార్ములా కథనైనా సరిగ్గా చెప్పేలా కథనం లేకపోవడం నిరుత్సాహపరచే అంశం. ఫస్టాఫ్‌లో కొంత మేర కథ కనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ సరిగ్గా లేదు. సరైన కథేమీ లేకపోవడంతో క్లైమాక్స్ వరకూ టైమ్ మెషీన్ అంటూ, చీటింగ్ అంటూ, వందల కోట్ల మనీ ట్రాన్స్‌ఫర్ అంటూ అర్థం లేని సన్నివేశాలతో నడిపించుకుంటూ వచ్చారు. ఈ సమయంలో వచ్చే సన్నివేశాలన్నీ కొన్నిచోట్ల మాత్రమే నవ్వించగా, ఇంకెక్కడా కనీస స్థాయిలో కూడా మెప్పించలేకపోయాయి. ఇక బ్ర‌హ్మానందంతో న‌డిపిన సెకండాఫ్ అయితే ఘ‌రోంగా ఉంది. ద‌ర్శకుడు సెక్ండాఫ్ క‌థ గాలికోదిలేశాడు. థియేట‌ర్ లో ప్రేక్ష‌కులు నిద్ర‌లోకి జారుకుంటున్నారంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇక కథ విషయం ఇలా ఉంటే క్యారెక్టరైజేషన్ కూడా ఎక్కడా ఆకట్టుకునేలా లేవు. విలన్ క్యారెక్టర్ ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. బ్రహ్మానందంకి ఓ పాత్రను సృష్టించి ఆ పాత్రతో కథ మొత్తాన్నీ మార్చేలా ఎన్నో సినిమాలు వచ్చినా, ఈ సినిమాలో అదే అంశం సిల్లీగా కనపడింది. లాజిక్ అన్న అంశానికి ఎక్కడా చోటేలేదు. ఇక సన్నివేశాల్లో బలమైన ఎమోషన్ కూడా లేదు. క్యారెక్ట‌రైజేష‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మ‌ల‌చ‌డం ఘోరం. ఇక హీరో సుశాంత్ కూడా ఎమోష‌న‌ల్ సీన్స్ చేయ‌లేక స‌త‌మతం అయ్యాడు. న్యూ లుక్..సిక్స్ ప్యాక్ లో క‌నిపించి లుక్ ప‌రంగా ఓకే అనిపించాడు. గ‌త చిత్రాల‌తో పోల్చితే చాల బెట‌ర్ అనిపించాడు. కానీ డైలాగ్ డెలివ‌రి మాత్రం ఇంకా ఆక‌ట్టుకునే లా లేక పోవ‌డం మైన‌స్‌.. సినిమా చూస్తుంటే..మ‌హేష్ బాబు న‌టించిన అత‌డు చిత్రం బాగా గుర్తుకు వ‌స్తుంది. నిజం చెప్పుకుంటే అత‌డు సినిమాకు తిర‌గ‌మాత వేసిన‌ట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందు దర్శకుడు జీ. నాగేశ్వర్ రెడ్డి గురించి చెప్పుకుంటే, ఒక కామెడీ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అవేవీ లేకుండా ఒక నీరసమైన కథ, కథనాలతో సినిమా తీయడం దగ్గరే విఫలమయ్యాడు. అలాంటి నీరసమైన కథతోనే అక్కడక్కడా నవ్వించినా, ఓవరాల్‌గా మాత్రం నిరాశపరచాడనే చెప్పాలి.అనూప్ రూబెన్స్ అందించిన పాటలు సాదాసీదాగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేదు. సినిమా అంతా రిచ్‌గా కనిపించేలా చేయడంలో ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో పాటు సినిమాటోగ్రఫీ పనితనం కూడా బాగానే ఉపయోగపడిందని చెప్పొచ్చు.

ఓవ‌రాల్ గా చూస్తే.. ఒక రోటిన్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఆడించిన బ‌ల‌వంతపు క‌థే ఈ ఆటాడుకుందాం రా.

Also Read

First Published:  19 Aug 2016 10:25 AM IST
Next Story