నన్ను, మా అన్నను కొనబోయారు- వైసీపీ ఎమ్మెల్యే
పార్టీ ఫిరాయించాల్సిందిగా టీడీపీ పెద్దలు తమపై ఒత్తిడి తెచ్చారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి చెప్పారు. పార్టీ మారితే భారీగా డబ్బులు ఇస్తామని ఎరవేశారన్నారు. తనతో పాటు తన సోదరుడు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కూడా చంద్రబాబు డబ్బు ఆశచూపారని సాయిప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అవినీతి సొమ్ముతోనే వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ తాను గానీ, తన సోదరుడు గానీ డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదన్నారు. ప్రజలు తమను […]
పార్టీ ఫిరాయించాల్సిందిగా టీడీపీ పెద్దలు తమపై ఒత్తిడి తెచ్చారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి చెప్పారు. పార్టీ మారితే భారీగా డబ్బులు ఇస్తామని ఎరవేశారన్నారు. తనతో పాటు తన సోదరుడు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కూడా చంద్రబాబు డబ్బు ఆశచూపారని సాయిప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అవినీతి సొమ్ముతోనే వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ తాను గానీ, తన సోదరుడు గానీ డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదన్నారు. ప్రజలు తమను నమ్మకంతో గెలిపించారని దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వేలలో బిల్లులు వేస్తున్నారని సాయిప్రసాద్ రెడ్డి విమర్శించారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో చంద్రబాబుకు ప్రజలు సున్నా మార్కులు వేస్తున్నారని ఆయన చెప్పారు.
Click on Image to Read: