రోశయ్య తరువాత... ఆనందిబెన్ తమిళనాడు గవర్నర్ అవుతారా?
తమిళనాడు గవర్నర్‌గా కె. రోశయ్య పదవీకాలం ఈ నెల 31న ముగుస్తుండగా…ఆయన తరువాత ఆ పదవిలోకి ఎవరు వస్తారనే విషయంపై ఊహాగానాలు వినబడుతున్నాయి. భారతీయ జనాతాపార్టీ…ఏ సీనియర్ నాయకుడికో ఈ పదవిని కట్టబెట్టవచ్చని అందరూ భావిస్తుండగా… ఇంకా ఈ విషయంలో తుది నిర్ణయం జరిగినట్టుగా లేదు. మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య 2011లో సుర్జిత్ సింగ్ బర్నాలా తరువాత తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను అప్పటి యుపిఎ ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత వచ్చిన […]
తమిళనాడు గవర్నర్‌గా కె. రోశయ్య పదవీకాలం ఈ నెల 31న ముగుస్తుండగా…ఆయన తరువాత ఆ పదవిలోకి ఎవరు వస్తారనే విషయంపై ఊహాగానాలు వినబడుతున్నాయి. భారతీయ జనాతాపార్టీ…ఏ సీనియర్ నాయకుడికో ఈ పదవిని కట్టబెట్టవచ్చని అందరూ భావిస్తుండగా… ఇంకా ఈ విషయంలో తుది నిర్ణయం జరిగినట్టుగా లేదు.
మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య 2011లో సుర్జిత్ సింగ్ బర్నాలా తరువాత తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను అప్పటి యుపిఎ ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత వచ్చిన ఎన్డిఎ ప్రభుత్వం…యుపిఎ నియమించిన గవర్నర్లను మార్చి కొత్తవారిని నియమిస్తూ వచ్చింది. కానీ రోశయ్యకు అన్నాడిఎంకె ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆయన పూర్తి పదవీ కాలం పదవిలో కొనసాగగలిగారు.
రోశయ్య తరువాత గవర్నర్‌గా… అవకాశం ఉన్న నేతల్లో కర్ణాటకకు చెందిన బిజెపి నాయకుడు శంకర్మూర్తి ముందున్నారు. ఆయన పేరు దాదాపు ఖరాలు అయిందని, ప్రకటించడమే తరువాయి అని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అయితే తమిళనాడుతో కర్ణాటకకు కావేరీ జలాల విషయంలో విభేదాలున్న నేపథ్యంలో…శంకరమూర్తి నియామకం పై బిజెపి అధిష్టానం మరొకసారి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక నుండి చివరిసారి తమిళనాడు గవర్నరుగా విధులు నిర్వహించిన వ్యక్తి మహారాజా సర్ జయచామరాజ ఒడెయార్ బహదూర్. ఆయన 1964-66మధ్యకాలంలో తమిళనాడు గవర్నరుగా పనిచేశారు. ఇదిలా ఉంటే బిజెపి పార్టీ తమిళనాడు గవర్నరు ఎంపికని జయలలితకే వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్-డిఎంకె పార్టీలకు వ్యతిరేకంగానూ జయలలితకు అనుకూలంగానూ ప్రవర్తిస్తున్న బిజెపి… ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జయలలిత తమిళనాడు గవర్నరుగా ఒక మహిళని నియమించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, ఆమె దృష్టిలో గురజాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ సైతం ఉన్నారని అన్నాడిఎంకె వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే అది బిజెపికి కూడా అనుకూలమే అవుతుంది. ఆనందిబెన్కి సైతం ఈ పదవి సముచితమైన స్థానం అవుతుందని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి.
Click on Image to Read: