భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించిన సాక్షి మాలిక్!
12 రోజులనుంచి చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న భారత క్రీడాభిమానులకు తీపికబురు. రెజ్లింగ్ లో భారత క్రీడాకారిణి సాక్షి మాలిక్ కాంస్యపతకం నెగ్గింది. ఖాతా తెరవకుండానే తిరుగు పయనమయ్యేలా ఉన్న భారత బృందాన్ని తలెత్తుకునేలా చేసింది. ఈ సారి రియోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలకు 100 మంది వెళ్లినా.. ఒక్క పతకం కూడా రాలేదన్న బెంగ తీర్చింది సాక్షి మాలిక్! 125 కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి జరిగిన మహిళల 58 […]
BY sarvi17 Aug 2016 11:13 PM GMT
X
sarvi Updated On: 18 Aug 2016 12:39 AM GMT
12 రోజులనుంచి చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న భారత క్రీడాభిమానులకు తీపికబురు. రెజ్లింగ్ లో భారత క్రీడాకారిణి సాక్షి మాలిక్ కాంస్యపతకం నెగ్గింది. ఖాతా తెరవకుండానే తిరుగు పయనమయ్యేలా ఉన్న భారత బృందాన్ని తలెత్తుకునేలా చేసింది. ఈ సారి రియోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలకు 100 మంది వెళ్లినా.. ఒక్క పతకం కూడా రాలేదన్న బెంగ తీర్చింది సాక్షి మాలిక్! 125 కోట్ల మంది భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.
భారత కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి జరిగిన మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచింది. కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో కిర్గిస్థాన్‌కు చెందిన ఐసులు టినీబెకోవాను ఓడించి కంచు మోత మోగించింది. ఈ బౌట్‌లో ఒక దశలో 0-4తో వెనుకబడ్డ మాలిక్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. మరో ఆరు సెకన్లలో బౌట్ ముగుస్తుందనగా 5-5తో సమంగా ఉన్న సాక్షి ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టి విజయం సాధించింది. రెపిచేజ్ రెండో రౌండ్‌లో సాక్షి 12-3తో మంగోలియా రెజ్లర్ ఒర్కాన్ పురెవ్‌దోర్జ్‌ను చిత్తు చేసి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో సాక్షి 1-3తో రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లోవా చేతిలో ఓటమిపాలైంది. అయితే, తన ప్రత్యర్థి ఫైనల్‌కు చేరుకోవడంతో సాక్షికి రెపిచేజ్ ఆడే అవకాశం దక్కింది. దీన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న మాలిక్ అద్భుత విజయంతో యావత్ భారతావని ఆనందపడేలా చేసింది.
Next Story