పొన్నంపై ఊపందుకున్న పాత ప్రచారం!
కాంగ్రెస్ నాయకుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్టీ మారతాడన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. గులాబీ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఏ వేదిక పంచుకున్నా.. ఇలాంటి ప్రచారం జరగడం మామూలైపోయింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ప్రచారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. పొన్నం అన్న కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్ కంపెనీ టెలెకా నెట్‌వర్క్ టెక్నాలాజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో […]
కాంగ్రెస్ నాయకుడు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్టీ మారతాడన్న ప్రచారం మళ్లీ ఊపందుకుంది. గులాబీ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఏ వేదిక పంచుకున్నా.. ఇలాంటి ప్రచారం జరగడం మామూలైపోయింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ప్రచారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. పొన్నం అన్న కుమారుడు హుజూరాబాద్‌లో నెలకొల్పిన ఐటీ స్టార్టప్ కంపెనీ టెలెకా నెట్‌వర్క్ టెక్నాలాజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాస్తవానికి పొన్నం ఇప్పుడు 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే కారెక్కాల్సిందని, ఆఖరి నిమిషంలో ఆగిపోయిందన్న ప్రచారం ఉంది.
2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎంపీలంతా చురుగ్గా పాల్గొన్నారు. అప్పటి ఎంపీలైన గుత్తా సుఖేందర్, మధుయాష్కీ, వివేక్, రాజయ్య, మందా జగన్నాథం తెలంగాణ ఉద్యమాన్ని సోనియా వద్ద పలుమార్లు ప్రస్తావించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఎంపీ పదవుల రాజీనామాకు సిద్ధమయ్యారు. కానీ సోనియా హామీ ఇచ్చారు కాబట్టే పార్టీలో ఉన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందినా.. పొన్నం కారెక్కుతారన్న ప్రచారం ఊపందుకుంది. కానీ, రాజ్యసభలో బీజేపీ తెలంగాణకు మద్దతు ఇచ్చినందుకు గాను ఆపార్టీకి కరీంనగర్ బీజేపీ సీటును ఇచ్చేందుకు టీఆర్ ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. సుష్మాస్వరాజ్ పోటీ చేస్తే మద్దతిచ్చేందుకు సిద్ధపడింది కారుపార్టీ. ఎంపీ స్థానాన్ని సుష్మకు రిజర్వ్ చేయడంతో కరీంనగర్ నుంచి ఏదైనా అసెంబ్లీ స్థానం కావాలని పొన్నం అడిగారని, అప్పటికే ఆశావహుల సంఖ్య అధికమైన నేపథ్యంలో పార్టీ అందుకు ససేమీరా అందన్న ప్రచారం ఉంది. పార్టీ మార్పువిషయమై వస్తోన్న వార్తలను పొన్నం వర్గం ఖండిస్తోంది. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది.
Click on Image to Read: