కార్పొరేట్ ఆసుపత్రులకు శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్!
గవర్నర్ నరసింహన్ గతంలో పలు సందర్భాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వేలు తెగినా.. వేలాది బిల్లులతో సామాన్యుడికి వైద్యం దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఇప్పుడు ఇదే బాటలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పయనిస్తున్నారు. అయితే నరసింహన్ తనదైన శైలిలో హితవు పలికితే.. శ్రీనివాస్ గౌడ్ తనకు అలవాటున్న పద్ధతిలో ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు. తీరుమార్చుకోకపోతే తీవ్ర […]
BY sarvi17 Aug 2016 5:56 AM IST
X
sarvi Updated On: 17 Aug 2016 10:46 AM IST
గవర్నర్ నరసింహన్ గతంలో పలు సందర్భాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వేలు తెగినా.. వేలాది బిల్లులతో సామాన్యుడికి వైద్యం దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఇప్పుడు ఇదే బాటలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పయనిస్తున్నారు. అయితే నరసింహన్ తనదైన శైలిలో హితవు పలికితే.. శ్రీనివాస్ గౌడ్ తనకు అలవాటున్న పద్ధతిలో ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు. తీరుమార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందజేసేందుకు రాష్ట్ర సర్కారు హెల్త్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కార్డులున్నప్పటికీ.. కొన్ని ఆసుపత్రులు వైద్యం చేసేందుకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ.. వైద్యం చేసేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకు రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీలు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందించమనడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏడాదిగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నా.. పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హెల్త్ కార్డులు ఉన్నా.. కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తీరుమార్చుకోవాలని హితవు పలికారు. శ్రీనివాస్ గౌడ్ ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం తీవ్ర చర్చకు దారి తీసింది.
Next Story