నయీం వద్ద 7 టెరాబైట్ల వీడియో చిట్టా!
1 టెరాబైట్ అంటేనే వందలాది సినిమాలు పట్టేంత స్పేస్ ఉంటుంది. అలాంటిది నయీం పాపాల చిట్టాలను 7 వేల టెరాబైట్ల వీడియోల్లో భద్రపరిచాడు. ఈ సమాచారం మొత్తం దాదాపు 10,000 సినిమాలకు సమానంగా ఉంటుందన్నమాట. ఈ చిట్టా గురించి తెలిసిన పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయట. తాను నక్సలైట్ అయినప్పటి నుంచి నయీంకు డైరీ రాయడం అలవాటు. ఇక పోలీసు కోవర్టుగా మారినప్పటి నుంచి డైరీ రాయడం మరింత పక్కాగా మెయింటెయిన్ చేయడం మొదలు పెట్టాడు. తరువాత […]
BY sarvi17 Aug 2016 4:01 AM IST
X
sarvi Updated On: 17 Aug 2016 10:59 AM IST
1 టెరాబైట్ అంటేనే వందలాది సినిమాలు పట్టేంత స్పేస్ ఉంటుంది. అలాంటిది నయీం పాపాల చిట్టాలను 7 వేల టెరాబైట్ల వీడియోల్లో భద్రపరిచాడు. ఈ సమాచారం మొత్తం దాదాపు 10,000 సినిమాలకు సమానంగా ఉంటుందన్నమాట. ఈ చిట్టా గురించి తెలిసిన పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయట. తాను నక్సలైట్ అయినప్పటి నుంచి నయీంకు డైరీ రాయడం అలవాటు. ఇక పోలీసు కోవర్టుగా మారినప్పటి నుంచి డైరీ రాయడం మరింత పక్కాగా మెయింటెయిన్ చేయడం మొదలు పెట్టాడు. తరువాత అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సమాచారాన్నంతా అందులో భధ్రపరిచాడు. 90వ దశకంలో తాను చేసిన నేరాలు, ప్రోత్సహించిన అధికారుల వివరాలు, నెరిపిన సంబంధాలు, వాటి వివరాలను కాగితాలపై భధ్రపరిచి వాటిని తరువాత కాలంలో స్కాన్ చేసి కంప్యూటర్లలోకి ఎక్కించాడు.
నయీం బతికి ఉన్నపుడు అధికారులు, రాజకీయ నేతలను మచ్చిక చేసుకునేందుకు పెద్ద ఎత్తున విందులు, పార్టీలు ఇచ్చాడు. అప్పుడు తన క్రిమినల్ బ్రెయిన్ వాడి ఆపార్టీలకు వచ్చిన వారికి తెలియకుండా వీడియోలు తీయించాడు. ఇందుకోసం చాలా శక్తిమంతమైన రహస్య కెమెరాలు వాడేవాడు. కబ్జాలు, సెటిల్మెంట్లు చేసే సమయంలో తనతో అధికారులు, రాజకీయనేతలు సాగించిన మంతనాలన్నీ భద్రంగా రికార్డు చేసి దాచిపెట్టాడు. నయీం వద్ద ఇంతపెద్ద ఎత్తున వీడియోలు బయటపడటంతో నల్లగొండ రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. నయీం ఇచ్చిన విందులకు హాజరైన అధికారులకైతే కంటిమీద కునుకు కరువైంది. సిట్ అధికారులు ఎప్పుడు ఎవరి పేర్లు, వీడియోలు బయటపెడతారోనని గుండె చేత బట్టుకుని కాలం వెళ్ల దీస్తున్నారని సమాచారం. మరోవైపు నయీంతో అంటకాగిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుతో సంబంధమున్న పోలీసులకు ఫోన్ చేసి అప్‌డేట్ల గురించి వాకబు చేస్తున్నట్లు సమాచారం. మరో విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. నయీం ముఠాతో సంబంధాలు నెరిపిన కొందరు కీలక వ్యక్తులు తమ పేర్లు బయటకి వస్తే ఎలా? అన్న ఆందోళనలో సీనియర్ లాయర్లను, న్యాయకోవిదులను ఆశ్రయిస్తున్నారు.
Next Story