సాక్షి కూడా వ్యతిరేక వార్తలు రాయడం లేదు- చంద్రబాబు
సాక్షి పత్రికకు చంద్రబాబుకు ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సాక్షిని చదవద్దు, సాక్షి టీవీని చూడొడ్డు అంటూ వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. పుష్కర ఏర్పాట్లను పరిశీలించేందుకు ధ్యానబుద్ధ ఘాట్‌కు చంద్రబాబు వెళ్లారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. చివరకు సాక్షి పత్రిక కూడా పుష్కర ఏర్పాట్లపై వ్యతిరేక వార్తలు రాయలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఒక వేళ వ్యతిరేక వార్తలు రాసినా సాక్షి పేపరు చదవద్దని సూచించారు. అయినా సాక్షి పత్రిక ఒక్క పుష్కరాల విషయంలో […]
సాక్షి పత్రికకు చంద్రబాబుకు ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సాక్షిని చదవద్దు, సాక్షి టీవీని చూడొడ్డు అంటూ వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. పుష్కర ఏర్పాట్లను పరిశీలించేందుకు ధ్యానబుద్ధ ఘాట్‌కు చంద్రబాబు వెళ్లారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు పుష్కరాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. చివరకు సాక్షి పత్రిక కూడా పుష్కర ఏర్పాట్లపై వ్యతిరేక వార్తలు రాయలేకపోతోందని వ్యాఖ్యానించారు.
ఒక వేళ వ్యతిరేక వార్తలు రాసినా సాక్షి పేపరు చదవద్దని సూచించారు. అయినా సాక్షి పత్రిక ఒక్క పుష్కరాల విషయంలో ఏ ఖర్మ… ఈ మధ్య చాలా విషయాల్లో బాబు విషయంలో చూసిచూడనట్టుగానే వెళ్తోంది. ఈ విషయంపై జగన్ అభిమానులే సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. అన్నట్టు వారానికి రెండు రోజులు మించి చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తలు రాయకూడదన్న అధికారిక నోటీసును కూడా సాక్షి కార్యాలయంలో అతికించారు కదా!. సాక్షి వ్యతిరేక కథనాలు రాయడం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యల్లోనూ నిజముంది.
Click on Image to Read: