తెహల్కాను చంద్రబాబు బతిమలాడుకున్నారా?
అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తనను ఉన్మాది అన్న వారే ఉన్మాదులని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలను తాను వ్యతిరేకించానని చెప్పారు. చివరకు ఆ సంస్కరణల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో అందరికీ తెలుసన్నారు. రెండున్నర ఎకరాలు ఆసామి సీఎం అయ్యారని… తొలి పాలనలోనే రూ. 3వేల కోట్లు సంపాదించుకున్నారని చంద్రబాబును ఉద్దేశించి ఏబీకే ఆరోపించారు. ఈ విషయాన్ని […]
అమరావతిలో భూ అక్రమాలు జరిగాయంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తనను ఉన్మాది అన్న వారే ఉన్మాదులని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ప్రవేశపెట్టిన సంస్కరణలను తాను వ్యతిరేకించానని చెప్పారు. చివరకు ఆ సంస్కరణల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో అందరికీ తెలుసన్నారు. రెండున్నర ఎకరాలు ఆసామి సీఎం అయ్యారని… తొలి పాలనలోనే రూ. 3వేల కోట్లు సంపాదించుకున్నారని చంద్రబాబును ఉద్దేశించి ఏబీకే ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పట్లో తెహల్కా పత్రిక వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయం ముందే తెలుసుకున్న చంద్రబాబు తెహల్కా పత్రికను బతిమిలాడుకున్నారని ఏబీకే వివరించారు. చివరకు ఆ పత్రికను బతిమలాడుకుని తన వివరణ వేయించుకోగలిగారని చెప్పారు. జగన్ తరపున తాను సుప్రీం కోర్టులో కేసు వేశానని చెప్పడాన్ని కూడా తప్పుపట్టారు. వేరే వారి తరపున కేసులు వేయించాల్సిన అవసరం జగన్‌కు ఏముంటుందని ప్రశ్నించారు.
Click on Image to Read: