నగరాల్లో వాహనాల వరద....రోజుకి 53,720 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి!
ఇప్పటికే నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టుగా రోజు రోజుకి రోడ్ల మీదకు వస్తున్న కొత్త వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రయివేటు వాహనాల అమ్మకాలు బాగా పెరిగిపోవటంతో… గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. 2015లో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1.96 కోట్లుగా ఉంది. అంటే రోజుకి దాదాపు 53,720 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 1993 వరకు సంవత్సరానికి వాహనాల రిజిస్ట్రేషన్లు 10 లక్షల కంటే తక్కువగా […]
ఇప్పటికే నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టుగా రోజు రోజుకి రోడ్ల మీదకు వస్తున్న కొత్త వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రయివేటు వాహనాల అమ్మకాలు బాగా పెరిగిపోవటంతో… గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఉంటున్నాయి. 2015లో వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1.96 కోట్లుగా ఉంది. అంటే రోజుకి దాదాపు 53,720 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 1993 వరకు సంవత్సరానికి వాహనాల రిజిస్ట్రేషన్లు 10 లక్షల కంటే తక్కువగా ఉండేవి. అప్పటినుండి ఈ సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2010 నుండి ఈ పెరుగుదల మరింతగా పుంజుకుంది. 2014లో 1.94 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగితే అది 2015కి 1.96 కోట్లకు చేరింది. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఉత్తర ప్రదేశ్ 2015లో 24.38 లక్షలతో దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి. ఢిల్లీలో ఈ సంఖ్య 6.27 లక్షలుగా ఉంది.
వీటిలో కొన్ని రీరిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ వాటి సంఖ్య తక్కువేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ అవుతున్న వాహనాల్లో 75శాతం టూవీలర్లు ఉంటున్నాయి. టూవీలర్ల ధర సగటుమనిషికి అందుబాటులో ఉండటం, బస్ ప్రయాణం కంటే వీటి ప్రయాణం ఖర్చు తక్కువగా ఉండటమే వీటి కొనుగోళ్లు పెరగడానికి కారణం. ప్రస్తుతం దేశంలో ఉన్న వాహనాల సంఖ్య 18.6 కోట్లు కాగా…ఇది వచ్చే ఇరవై ముప్పయ్ ఏళ్లలో 35 కోట్లకు చేరుతుందని నగర రవాణా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయాల్సి ఉందని, విధానపరమైన నిర్ణయాలు చేసే వారు ఈ విషయంపై ఏమీ ఆలోచించడం లేదని వారు చెబుతున్నారు. ఒక్క ఢిల్లీలోనే దేశంలోని మొత్తం వాహనాల్లో 8శాతం ఉన్నాయని…అంటే దాదాపు 80లక్షలని…ఇక రోడ్లమీద వాహనాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చని ఆ నిపుణులు అంటున్నారు.
దేశంలో బస్‌ల సదుపాయం పెరిగితే కానీ ఈ పరిస్థితిలో మార్పు రాదని ప్రజా రవాణా రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టూవీలర్లు, కార్లు కొనడానికి తేలిగ్గా లోన్లు దొరకటం, అదే బస్‌ని కొనాలంటే అలాంటి తేలికపాటి సదుపాయాలు లేకపోవటం….ప్రయివేటు వాహనాల యజమానులు 15 ఏళ్లపాటు రోడ్డు పన్నుని చెల్లించాల్సి ఉండగా..బస్ యజమానులు ప్రతి సీటుకి సాంవత్సరిక పన్ను చెల్లించాల్సి రావటం…తదితర విషయాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకే ప్రజా రవాణా రంగంలోకి పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా రావటం లేదని వివరిస్తున్నారు.
మొత్తానికి ఏ విషయంలోనైనా సమతౌల్యం లోపిస్తే ఏం జరుగుతుందో… మన రోడ్లమీద వాహనాల సంఖ్య విషయంలోనూ అదే జరుగుతోంది. వాహనాల సంఖ్య పెరిగినట్టుగా రోడ్లు పెరగవు…. అనే చిన్న లాజిక్‌ని మనం మర్చిపోతే…పెరిగేది ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యామే మరి.
Click on Image to Read: