ఐసిస్ మీద కోపంతో బురఖాలు తగల బెట్టారు..!
సిరియా ఉత్తర ప్రాంతంలో ఉండే మంజిబ్ నగరం ఐసిస్ కబంధహస్తాల నుంచి విముక్తి పొందింది. ఈ నగరం రెండేళ్ళ నుంచి ఐసిస్ ఆధీనంలో ఉంది. సిరియన్ డెమొక్రటిక్ దళాలు వీరోచిత పోరాటం చేసి ఐసిస్ పెత్తనం నుంచి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ నగరాన్ని కోల్పోవడం ఐసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ. విదేశాల నుంచి ఐసిస్‌లో చేరాలనుకునే వాళ్ళు ఈ మార్గం ద్వారానే వచ్చేవాళ్ళు. వాళ్ళకు కావాల్పినవి కూడా చేరడానికి ఇదే మార్గం. ఈ నగరంపై పట్టుకోల్పోవడం ఐసిస్‌కు […]
సిరియా ఉత్తర ప్రాంతంలో ఉండే మంజిబ్ నగరం ఐసిస్ కబంధహస్తాల నుంచి విముక్తి పొందింది. ఈ నగరం రెండేళ్ళ నుంచి ఐసిస్ ఆధీనంలో ఉంది.
సిరియన్ డెమొక్రటిక్ దళాలు వీరోచిత పోరాటం చేసి ఐసిస్ పెత్తనం నుంచి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ నగరాన్ని కోల్పోవడం ఐసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ. విదేశాల నుంచి ఐసిస్‌లో చేరాలనుకునే వాళ్ళు ఈ మార్గం ద్వారానే వచ్చేవాళ్ళు. వాళ్ళకు కావాల్పినవి కూడా చేరడానికి ఇదే మార్గం. ఈ నగరంపై పట్టుకోల్పోవడం ఐసిస్‌కు పెద్ద దెబ్బ.
మంజిబ్ నగరం ఐసిస్ నియంత్రణ నుంచి బయటపడడంతో మంజిబ్ వాసులు పండగ చేసుకున్నారు.
ఐసిస్ ఈ రెండేళ్ళు మంజిబ్ వాసులపై మతపరమైన తీవ్ర ఆంక్షలు విధించింది.
ఐసిస్ పీడ విరగడైందన్న ఆనందంలో మంజిబ్ పురుషులు కొందరు గడ్డాలు కత్తించుకున్నారు. స్త్రీలు కొందరు నృత్యాలు చేస్తూ సిగరెట్లు తాగారు, మరికొందరు బురఖాలు తగలబెట్టి ఐసిస్ ఆగడాలకు నిరసన వ్యక్తం చేశారు.
Click on Image to Read: