ఇక గుండెపోటుని నిముషంలో...నిర్దారించవచ్చు!
గుండెకి సంబంధించిన వ్యాధులను అత్యంత తక్కువ సమయంలో అత్యంత సమర్ధవంతంగా కనిపెట్టే విధానాలు, పరికరాలు ఇప్పుడు మనకు చాలా అవసరం. అందుకే దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. ఈ శాస్త్రవేత్తల్లో మన భారత సంతతి శాస్త్రవేత్త అభినవ్ కూడా ఉండటం విశేషం. వీరు ఒక ఎలక్ట్రికల్ ఇమ్యునోసెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను, హార్ట్ […]
గుండెకి సంబంధించిన వ్యాధులను అత్యంత తక్కువ సమయంలో అత్యంత సమర్ధవంతంగా కనిపెట్టే విధానాలు, పరికరాలు ఇప్పుడు మనకు చాలా అవసరం. అందుకే దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. ఈ శాస్త్రవేత్తల్లో మన భారత సంతతి శాస్త్రవేత్త అభినవ్ కూడా ఉండటం విశేషం.
వీరు ఒక ఎలక్ట్రికల్ ఇమ్యునోసెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. దీని ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను, హార్ట్ ఎటాక్స్ని ఒక్క నిముషంలో కనుగొని నిర్దారించవచ్చు. ఇందుకోసం వీరు కార్డియాక్ ట్రొపోనిన్ ఐ… అనే ప్రొటీన్… రక్తంలో ఎంత పరిమాణంలో ఉందో చూస్తారు. గుండె పోటు వచ్చినపుడు…రక్తం గడ్డకట్టి….స్రవించే సీరంలో ఈ ప్రొటీన్..ఉంటుంది. ఇలాంటపుడు ఒక్క రక్తపు బొట్టుని ఇమ్యునోసెన్సార్ పరికరం ద్వారా పరీక్షించి కార్డియాక్ ట్రొపోనిన్ ఐ పరిమాణం ఎంత ఉందో తెలుసుకుంటే , తద్వారా పరిస్థితి తీవ్రతని అంచనావేసే వీలుంది.
అంటే ఎలక్ట్రికల్ ఇమ్యునోసెన్సార్ పరికరం హార్ట్ ఎటాక్లో… రక్తం గడ్డ కట్టినపుడు స్రవించే సీరంలో ఉండే ప్రొటీన్ని… రక్తంనుండి క్షణాల్లో విడగొట్టి దాని పరిమాణాన్ని చూపుతుంది. ఇమ్యునోసెన్సార్ విధానం ద్వారా…పరిశీలించాల్సిన ప్రొటీన్ని… ఎలక్ట్రిక్ ఫోర్స్ ద్వారా త్వరగా బయటకు తెచ్చే వీలు ఉంది. దీనివలన…అరవై నిముషాలు వేచి ఉండాల్సిన ఈ పరీక్ష ఒక్క నిముషంలో పూర్తయ్యే వీలు కలుగుతుంది. ఒక్క రక్తపు చుక్కలోని సీరం నుండి కార్డియాక్ ట్రొపోనిన్ ఐ పరిమాణం ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవటం…అనేది మరీ గొప్ప విషయంగా చెప్పలేకపోయినా….గుండెవ్యాధి నిర్దారణకు అవసరమైన ప్రొటీన్ని… ఎలక్ట్రికల్ శక్తి ద్వారా వేగంగా బయటకు తేవటంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిద్వారా ప్రొటీన్ని గుర్తించగల సమయం, కాల వ్యవధి విషయంలో ముందడుగు వేసినట్టేనని వారు చెబుతున్నారు.
Click on Image to Read: