యువతులే నయీం ఆయుధాలు, కవచాలు!
లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ బతికున్నపుడు ఆడ సైన్యాన్ని అంగరక్షకులుగా నియమించుకున్నాడు గుర్తుందా? గ్యాంగ్‌స్టర్ నయీం కూడా సరిగ్గా ఇదే బాటలో పయనించాడు. 20 ఏళ్లలోపు యువతులను తనకు కవచాలుగా వాడుకునేవాడని తెలుస్తోంది. ఆడవారిని తనకు మూడంచెల రక్షణ వ్యవస్థలా నయీం ఉపయోగించేవాడు. నయీంను కనీసం తాకాలన్నా వీరు అనుమతించేవారు కాదు. బాధితులు కనీసం నయీం కాళ్లావేళ్లా పడదామన్నా చేతిలో అత్యాధునిక తుపాకులు పట్టుకున్న ఈ యువతులు ముందుకు పోనిచ్చే వారు కాదు. కంటి సైగతోనే వెనక్కి […]
లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ బతికున్నపుడు ఆడ సైన్యాన్ని అంగరక్షకులుగా నియమించుకున్నాడు గుర్తుందా? గ్యాంగ్‌స్టర్ నయీం కూడా సరిగ్గా ఇదే బాటలో పయనించాడు. 20 ఏళ్లలోపు యువతులను తనకు కవచాలుగా వాడుకునేవాడని తెలుస్తోంది. ఆడవారిని తనకు మూడంచెల రక్షణ వ్యవస్థలా నయీం ఉపయోగించేవాడు. నయీంను కనీసం తాకాలన్నా వీరు అనుమతించేవారు కాదు. బాధితులు కనీసం నయీం కాళ్లావేళ్లా పడదామన్నా చేతిలో అత్యాధునిక తుపాకులు పట్టుకున్న ఈ యువతులు ముందుకు పోనిచ్చే వారు కాదు. కంటి సైగతోనే వెనక్కి వెళ్లాలని బెదిరించేవారు. సెటిల్‌మెంట్లు చేస్తున్నపుడు నయీం కు వీరంతా రక్షణగా ఉండేవారు. బాధితులు కాళ్లు పట్టుకుంటే ఎక్కడ కరిగిపోతాడోనని వారు నయీం నీడను కూడా తాకనిచ్చేవారు కాదు.
ఇంతకాలం కేవలం ప్రయాణసమయంలోనే నయీం మహిళలనువాడుకునేవాడు అని అంతా అనుకున్నారు. కానీ, అతని బాధితులు ఒక్కొక్కరు వచ్చి పోలీసులకు ఫిర్యాదులు ఇస్తూ అతని ఆడ సైన్యం గురించి కథలు, కథలుగా చెబుతుంటే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నయీం సెటిల్‌మెంట్లు, మర్డర్లు చేయడానికి వీరిని ఎక్కువగా వాడుకునేవాడట. ఎంతటి రౌడీకైనా ఆడవాళ్ల వీక్ నెస్ ఉంటుంది. అందుకే, ముంబై నుంచి 20 ఏళ్లలోపు అందగత్తెలను తీసుకొచ్చి వారికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి, ఆయుధ శిక్షణ ఇప్పించి తనకు అంగరక్షకులుగా నియమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తాను చంపాలనుకునేవారు నయీం మాటలను పెడచెవిన పెడితే వీరిని రంగంలోకి దింపేవాడు . వీళ్లను ఎరగా వేసి ఒంటరిగా రప్పించేవాడు. అప్పుడు నయీం యాక్షన్ టీం రంగంలోకి దిగి కిరాతకంగా బాధితుడ్ని మట్టుబెట్టేవాళ్లు. మాజీ మావోయిస్టు సాంబశివుని తమ్ముడు కొసపురి రాములు ఉదంతంలోనూ ఓ మహిళ కీలకంగా వ్యవహరించింది. రాములు హత్యానంతంర సదరు మహిళ పోలీసులకు లొంగిపోయింది కూడా. కొన్ని హత్యలు, సెటిల్‌మెంట్లను కూడా ఈ ఆడవాళ్లే చేసినట్లు సమాచారం.
Click on Image to Read: