అలాంటి సీఎం దొరకడం ప్రజల అదృష్టం
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ పాలనను బాగుందని మెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న మోహన్‌బాబు… కేసీఆర్‌లాంటి సీఎం దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాజకీయలకతీతంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. 13 ఏళ్ల క్రితం తన కుమార్తెకు వివాహం కావాలని కోరుకునేందుకు వేములవాడ వచ్చానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. వేములవాడ రాజన్న దయతో తమ కుటుంబమంతా సంతోషంగా ఉందన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి […]

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ పాలనను బాగుందని మెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్న మోహన్‌బాబు… కేసీఆర్‌లాంటి సీఎం దొరకడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. రాజకీయలకతీతంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. 13 ఏళ్ల క్రితం తన కుమార్తెకు వివాహం కావాలని కోరుకునేందుకు వేములవాడ వచ్చానని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. వేములవాడ రాజన్న దయతో తమ కుటుంబమంతా సంతోషంగా ఉందన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృష్టి గొప్పగా ఉందన్నారు మోహన్ బాబు.
Click on Image to Read: