వ్యవస్థపై జగన్ వైరాగ్యం
వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్ సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఆవేదన చెందారు. నిజంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందా అని ప్రశ్నించారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో స్వాతంత్ర్యం అనేదే లేకుండా పోతోందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దళితులను నడిరోడ్డుపై కట్టేసి చెప్పులతో కొట్టిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలో చేరుతున్న వారిని చూస్తున్నామన్నారు. కళ్లముందే రాజ్యాంగాన్ని […]
వైసీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్ సమాజంలో జరుగుతున్న ఘటనలపై ఆవేదన చెందారు. నిజంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందా అని ప్రశ్నించారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో స్వాతంత్ర్యం అనేదే లేకుండా పోతోందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దళితులను నడిరోడ్డుపై కట్టేసి చెప్పులతో కొట్టిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు. ఒక పార్టీ తరపున గెలిచి మరొక పార్టీలో చేరుతున్న వారిని చూస్తున్నామన్నారు. కళ్లముందే రాజ్యాంగాన్ని వెటకారం చేస్తున్నారని జగన్ అన్నారు. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి దొరికిన వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదంటే ఈ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇవన్నీ చూస్తుంటే దేశానికి నిజంగానే స్వాతంత్ర్యం వచ్చిందా అన్న అనుమానం కలుగుతోందన్నారు . ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై జనం నేతలను నిలదీయాలన్నారు జగన్.
Click on Image to Read: