అనంత పద్మనాభుడి సంపద...అవినీతి పరుల చేతుల్లోకి!
కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికిన అపారనిధులు అవినీతిపరుల చేతికి చిక్కడం మొదలైంది. భారత మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ ఈ మేరకు సుప్రీం కోర్టుకి ఒక నివేదికను సమర్పించారు. అందులో ఆయన స్వామివారి ఆలయంలో దొరికిన నిధుల్లోంచి 769 బంగారు కుండలు మాయం అయినట్టుగా తెలిపారు. మాయమైన బంగారు కుండల బరువు 776 కేజీలు ఉంటుందని, వాటి విలువ దాదాపు 186 కోట్ల రూపాయిలు ఉంటుందని రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. […]
కేరళలోని తిరువనంతపురంలో అనంతపద్మనాభస్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికిన అపారనిధులు అవినీతిపరుల చేతికి చిక్కడం మొదలైంది. భారత మాజీ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ ఈ మేరకు సుప్రీం కోర్టుకి ఒక నివేదికను సమర్పించారు. అందులో ఆయన స్వామివారి ఆలయంలో దొరికిన నిధుల్లోంచి 769 బంగారు కుండలు మాయం అయినట్టుగా తెలిపారు. మాయమైన బంగారు కుండల బరువు 776 కేజీలు ఉంటుందని, వాటి విలువ దాదాపు 186 కోట్ల రూపాయిలు ఉంటుందని రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. ఇంకా కరిగించడానికి, శుద్ధి చేయడానికి పంపిన 30 శాతం బంగారం కూడా మాయమైందని రాయ్ నివేదిక పేర్కొంది.
భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని ధర్మాసనం త్వరలో దీనిపై విచారణ చేపట్టనుంది. రాయ్ తన నివేదికని రెండు సంపుటాలుగా ఐదు భాగాలుగా వెయ్యి పేజీల్లో పొందుపరచినట్టుగా తెలుస్తోంది. ఆలయంలో దొరికిన నిధులపై ఆడిటింగ్ పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు గత ఏడాది అక్టోబరులో వినోద్ రాయ్‌ని కోరింది.
Click on Image to Read: