నాకున్న సంపద జనమే, భారీ ప్యాకేజ్ ప్రకటన
అనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసగించారు. అనంతపురం జిల్లా తనకు అండగా నిలిచిన జిల్లా అని చెప్పారు. అనంతపురం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృష్టి చేస్తామన్నారు. ఎన్టీఆర్ అనంతపురం జిల్లా ముద్దుబిడ్డ అని అన్నారు. అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ ఆశయం పేరుతో రూ. 6,554కోట్ల ప్యాకేజ్‌ను ప్రకటించారు. కరువు నివారణకు 1,767కోట్లు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 2,654కోట్లు, తాగునీటికి రూ. 500 కోట్లు, పరిశ్రమలకు […]
అనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసగించారు. అనంతపురం జిల్లా తనకు అండగా నిలిచిన జిల్లా అని చెప్పారు. అనంతపురం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృష్టి చేస్తామన్నారు. ఎన్టీఆర్ అనంతపురం జిల్లా ముద్దుబిడ్డ అని అన్నారు. అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ ఆశయం పేరుతో రూ. 6,554కోట్ల ప్యాకేజ్‌ను ప్రకటించారు. కరువు నివారణకు 1,767కోట్లు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 2,654కోట్లు, తాగునీటికి రూ. 500 కోట్లు, పరిశ్రమలకు రూ. 100 కోట్లు కేటాయిస్తామన్నారు. రాయలసీమపై ఉన్న అపవాదును తొలగిస్తామన్నారు. తనకు ఉన్న సంపద జలం, జనమేనని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ రాళ్ల సీమ అవుతుందన్నారని, కానీ తాము రతనాల సీమగా మారుస్తున్నామని చెప్పారు. మొక్కలు పెంచే విద్యార్థులకు అదనపు మార్కులు వేస్తామన్నారు. అనంతపురంలో కేంద్ర విశ్వ విద్యాలయం రావాలన్నారు. పోలవరానికి తగిన నిధులు ఇవ్వడం లేదన్నారు. విభజన సమస్యల పరిష్కారం కాగితాలపై పరిమితమైందని విమర్శించారు. దేశ వృద్ధి రేటుకంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు అధికంగా ఉందన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు.
Click on Image to Read: