చేతిమీద టాటూ...కంప్యూటర్‌ని కంట్రోల్ చేస్తుంది!
టెక్నాలజీ ప్రగతిలో మరొక ముందడుగు ఇది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ సంస్థ ఒక మెటాలిక్ టాటూని రూపొందించింది. ఈ టాటూ ద్వారా కంప్యూటర్, స్మార్ట్ఫోన్…ఇంకా దీనికి కనెక్ట్ చేసిన ఇతర డివైస్‌లను కంట్రోల్ చేయవచ్చు. పొరలుపొరలుగా బంగారు ఆకులా ఉండే ఈ టాటూని నేరుగా చర్మం మీద అమర్చుకోవచ్చు. వద్దనుకుంటే తీసివేసే సౌకర్యం కూడా ఉంది. ఫొటోఫ్రేములకు, చాక్‌లెట్స్‌కి అలంకరణకోసం వాడే బంగారు రంగు పేపరుని ఈ టాటూకోసం ఉపయోగించారు. ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ […]
టెక్నాలజీ ప్రగతిలో మరొక ముందడుగు ఇది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ సంస్థ ఒక మెటాలిక్ టాటూని రూపొందించింది. ఈ టాటూ ద్వారా కంప్యూటర్, స్మార్ట్ఫోన్…ఇంకా దీనికి కనెక్ట్ చేసిన ఇతర డివైస్‌లను కంట్రోల్ చేయవచ్చు. పొరలుపొరలుగా బంగారు ఆకులా ఉండే ఈ టాటూని నేరుగా చర్మం మీద అమర్చుకోవచ్చు. వద్దనుకుంటే తీసివేసే సౌకర్యం కూడా ఉంది. ఫొటోఫ్రేములకు, చాక్‌లెట్స్‌కి అలంకరణకోసం వాడే బంగారు రంగు పేపరుని ఈ టాటూకోసం ఉపయోగించారు.
ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యే చిన్నపాటి సర్క్యూట్లను కలుపుతూ ఇది కండర్టర్లా పనిచేస్తుంది. చర్మంమీదే అతుక్కుని ఉండే ఈ టాటూలు, వీటిని ధరించినవారు తమ కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేలా చేస్తాయి. టాటూలను స్వైప్ చేస్తే …వాటిని అనుసంధానించిన యాప్లను వినియోగించుకోవచ్చు. అయితే ఈ యాప్లు వినియోగదారుల అవసరాలను బట్టి భిన్న రకాలుగా ఉంటాయి.
ఉదాహరణకు ఒక టాటూ శరీర ఉష్ణాగ్రతని బట్టి దాని రంగుని మార్చుకుంటుంది. మరొక టాటూని కపుల్ హార్మనీ అనే యాప్కి అనుసంధానం చేశారు. ఈ టాటూని శరీరంమీద అమర్చుకున్న వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్ తెరమీద తమ భాగస్వామిని చూడవచ్చు. ఇలా రకరకాల ఉపగాయోల కోసం సైంటిస్టులు… భిన్న టాటూలను తయారుచేశారు. అవసరాన్ని బట్టి కావాలసిన టాటూని ఎంపిక చేసుకోవాలన్నమాట.