Telugu Global
Cinema & Entertainment

మోడీ డ్రెస్ అసభ్యంగా వేసుకున్నందుకు నటిపై కేసు

రాఖి సావంత్ పేరు వింటేనే చాలు.. చాలా మందికి ఆమె డ్రామా క్వీన్ అనే ట్యాగ్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ ఏదో చేసి… కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటు. పబ్లిసిటీ కోసం ఏమైనా చెయ్యగల ధైర్యం ఉంది ఆమెలో. ఇటీవల ప్రీ-ఇండిపెన్‌డెన్స్ బ్యాష్‌లో ఒక కురచటి నల్ల గౌన్ వేసుకుంది. నటులు కురచ దుస్తులు వేసుకోవడం ఏమంత విశేషం కాదు కాని, ఆమె డ్రెస్సుపై ప్రధాన మంత్రి మోడీ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. అందులో రెండు పెద్ద బొమ్మలు; […]

మోడీ డ్రెస్ అసభ్యంగా వేసుకున్నందుకు నటిపై కేసు
X

రాఖి సావంత్ పేరు వింటేనే చాలు.. చాలా మందికి ఆమె డ్రామా క్వీన్ అనే ట్యాగ్ గుర్తుకువస్తుంది. ఎప్పుడూ ఏదో చేసి… కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఆమెకు అలవాటు. పబ్లిసిటీ కోసం ఏమైనా చెయ్యగల ధైర్యం ఉంది ఆమెలో. ఇటీవల ప్రీ-ఇండిపెన్‌డెన్స్ బ్యాష్‌లో ఒక కురచటి నల్ల గౌన్ వేసుకుంది. నటులు కురచ దుస్తులు వేసుకోవడం ఏమంత విశేషం కాదు కాని, ఆమె డ్రెస్సుపై ప్రధాన మంత్రి మోడీ బొమ్మలు ముద్రించి ఉన్నాయి. అందులో రెండు పెద్ద బొమ్మలు; ఆమె ఎదపై ఒకటి మరియు ఇంకొకటి ఆమె పిరుదులపై ముద్రించి ఉన్నాయి. ఈ ఈవెంట్ US లో జరిగింది. ఇప్పుడు ఒక NGO రాఖీ సావంత్ పై కేసు వేసింది. అంతర్జాతీయంగా ఆమె మన ప్రధాన మంత్రిని అగౌరవపరిచిందనే వాజ్యం కోర్టు విచారణకు స్వీకరించింది. మరి ఇది కూడ పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని రాఖీ మురిసిపోతుందో ఏమో చూడాలి!

rakhi-main1

First Published:  14 Aug 2016 7:46 AM IST
Next Story