Telugu Global
National

గుజ‌రాత్ పోలీసుల నెత్తిన పాలు పోసిన న‌యీం చావు!

బ‌తికున్నంత‌కాలం ప్ర‌త్య‌ర్థుల‌ను, పోలీసుల‌ను భ‌య‌పెట్టిన న‌యీం చ‌నిపోయి గుజ‌రాత్ పోలీసుల నెత్తిన పాలుపోశాడు. ఎలాగంటారా?  సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్ కేసులో సీబీఐ న‌యీముద్దీన్ కోసం చాలాకాలంగా గాలిస్తోంది. సోహ్ర‌బుద్దీన్‌ను గుజరాత్ పోలీసులు 2005లో ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఈ ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మన్న ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై కేసు న‌మోదైంది. కేసు సీబీఐకి బ‌దిలీ అయింది. వారి విచార‌ణ‌లో సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌యీం కూడా కీల‌క సాక్షే అని తేల్చింది. ఎన్‌కౌంట‌ర్‌కు న‌యీంకు ఉన్న సంబంధం ఏంటి? అనుకుంటున్నారా. సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్ […]

గుజ‌రాత్ పోలీసుల నెత్తిన పాలు పోసిన న‌యీం చావు!
X
బ‌తికున్నంత‌కాలం ప్ర‌త్య‌ర్థుల‌ను, పోలీసుల‌ను భ‌య‌పెట్టిన న‌యీం చ‌నిపోయి గుజ‌రాత్ పోలీసుల నెత్తిన పాలుపోశాడు. ఎలాగంటారా? సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్ కేసులో సీబీఐ న‌యీముద్దీన్ కోసం చాలాకాలంగా గాలిస్తోంది. సోహ్ర‌బుద్దీన్‌ను గుజరాత్ పోలీసులు 2005లో ఎన్‌కౌంట‌ర్ చేశారు. ఈ ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మన్న ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై కేసు న‌మోదైంది. కేసు సీబీఐకి బ‌దిలీ అయింది. వారి విచార‌ణ‌లో సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్‌లో న‌యీం కూడా కీల‌క సాక్షే అని తేల్చింది. ఎన్‌కౌంట‌ర్‌కు న‌యీంకు ఉన్న సంబంధం ఏంటి? అనుకుంటున్నారా. సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్ బూట‌క‌మ‌ని వార్త‌లువ‌చ్చిన‌ట్లే.. అత‌ని స‌మాచారం గుజ‌రాత్ పోలీసుల‌కు ఇచ్చింది న‌యీమేన‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అందుకే సీబీఐ అత‌ని కోసం తీవ్రంగా గాలించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈకేసులో ఇద్ద‌రు ఐపీఎస్‌లు, ఏడుగురు పోలీసు ఇన్‌స్పెక్ట‌ర్లు నిందితులుగా ఉన్నారు. సోహ్ర‌బుద్దీన్ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన కీల‌క సాక్షి న‌యీం ఇటీవ‌ల మ‌ర‌ణించడంతో గుజరాత్ పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న‌ట్లు తెలిసింది. ఆ ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన ఒకే ఒక్క సాక్షి కూడా పోలీసుల చేతిలో హ‌త‌మ‌వ‌డంతో ఇంక సోహ్ర‌బుద్దీన్ కేసు ముందుకు పోయే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.
First Published:  14 Aug 2016 7:31 AM IST
Next Story