పుష్కర పుణ్యస్నానాలు...కాలుష్యాల పాపం కృష్ణలోకి!
పుణ్యాన్ని సంపాదించుకునే క్రమంలో కృష్ణానదిని కాలుష్యకూపంగా మార్చవద్దని…పుష్కరాల సందర్భంగా అధికారులు పదేపదే కోరుతున్నారు. పుష్కర స్నానంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పుష్కరాల్లో 3.5కోట్ల మంది పుష్కర స్నానం ఆచరిస్తారని అంచనా ఉండగా…ఆ మేరకు కృష్ణానదిలో పేరుకుపోయే కాలుష్యాన్ని గురించి పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలోని అత్యంత కాలుష్యభరితమైన నదుల్లో కృష్ణా నది ఒకటి కాగా…ఈ పుష్కరాలు నదిని మరింత కాలుష్యమయం చేస్తాయనే ఆందోళన ఉంది. 3.5 కోట్లమంది పుష్కరస్నానం చేస్తారని […]
పుణ్యాన్ని సంపాదించుకునే క్రమంలో కృష్ణానదిని కాలుష్యకూపంగా మార్చవద్దని…పుష్కరాల సందర్భంగా అధికారులు పదేపదే కోరుతున్నారు. పుష్కర స్నానంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పుష్కరాల్లో 3.5కోట్ల మంది పుష్కర స్నానం ఆచరిస్తారని అంచనా ఉండగా…ఆ మేరకు కృష్ణానదిలో పేరుకుపోయే కాలుష్యాన్ని గురించి పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశంలోని అత్యంత కాలుష్యభరితమైన నదుల్లో కృష్ణా నది ఒకటి కాగా…ఈ పుష్కరాలు నదిని మరింత కాలుష్యమయం చేస్తాయనే ఆందోళన ఉంది. 3.5 కోట్లమంది పుష్కరస్నానం చేస్తారని భావిస్తుండగా..ఒక్కొక్కరు కనీసం రెండుసార్లు అంతకంటే ఎక్కువగా నదిలో మునుగుతారని అనుకుంటే….దాదాపు 8కోట్ల స్నానాలు అవుతాయి. ప్రతి ఒక్కరు 7.5 మిల్లీలీటర్ల షాంపు, 20 గ్రాముల సబ్బు ఉపయోగిస్తారనుకుంటే…అదంతా కలిసి ఆరులక్షల లీటర్ల షాంపు, 16లక్షల కిలోల సబ్బు అవుతుంది. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు…నీళ్ల ద్వారా వ్యాపించే ఇ కొలీ బ్యాక్టీరియాను గురించి హెచ్చరిస్తోంది.
పుష్కర స్నానం చేసేవారికి ఈ విషయాల పట్ల అవగాహనని పెంచడం ఒక్కటే…నదిని, స్నానమాచరించేవారిని కాపాడే మార్గమని హేతువాద సంస్థలు సూచిస్తున్నాయి. అధికారులు కాలుష్యనివారణ, శుభ్రత విషయాల్లో తగిన అవగాహన కల్పించకపోతే విపరీత పరిణాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా భక్తులు నదిలో వదిలేసే ప్లాస్టిక్ బ్యాగుల చెత్త మరొక పెద్ద ముప్పుగా మారనుంది. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 43 పుష్కరఘాట్లు ఉండగా ప్రతి కిలోమీటరుకి ఒక డస్ట్‌బిన్‌ని ఉంచారు. దీన్ని బట్టి చెత్తా చెదారం సమస్య ఎంత తీవ్రంగా మారబోతోందో అర్థం చేసుకోవచ్చు. 20వేలమంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వీరంతా మూడు షిఫ్టులుగా విడిపోయి 24 గంటలు సేవల అందిస్తారు. అయినా భక్తులు అందించే సహకారం, తీసుకునే జాగ్రత్తలే కృష్ణానది కాలుష్యమయం కాకుండా కాపాడే మార్గాల్లో మొదటిది అవుతుంది. పుష్కరస్నానానికి వచ్చేముందే పళ్లు తోముకోవటం… తదితర కార్యక్రమాలు ముగించుకుని రావాలని అధికారులు భక్తులకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవన్నీ భక్తులు పాటించకపోతే…ఇప్పుడు తమ పాపాలు పోగొట్టుకోవడానికిగాను…భవిష్యత్తు తరాలకు కృష్ణా నదిని మిగలనివ్వని పాపం మూటకట్టుకోవాల్సి ఉంటుంది మరి.
Click on Image to Read: