త్వరలోనే ఉద్యమాన్ని ప్రారంభిస్తా...
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. రాయలసీమకు నీరు అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో 854అడుగుల నీటిమట్టం ఉంటేనే రాయలసీమకు నీరు అందుతాయని, కానీ ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని కోట్ల ఆవేదన చెందారు. రాయలసీమ నీటి హక్కులను కాపాడుకునేందుకు […]
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. రాయలసీమకు నీరు అందకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం డ్యాంలో 854అడుగుల నీటిమట్టం ఉంటేనే రాయలసీమకు నీరు అందుతాయని, కానీ ఆ పరిస్థితి లేకుండా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని కోట్ల ఆవేదన చెందారు. రాయలసీమ నీటి హక్కులను కాపాడుకునేందుకు త్వరలోనే ఉద్యమం ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందు కోసం త్వరలోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండేళ్ల కాలంలో టీడీపీ పెద్దలు దోచుకోవడానికే పరిమితమయ్యారని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.చూడాలి రాయలసీమ కోసం ఉద్యమం చేస్తానంటున్న కోట్ల ఆ మాటపై ఎంతవరకు నిలబడుతారో!. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Click on Image to Read: