Telugu Global
NEWS

చంద్ర‌బాబు, కేసీఆర్ ల‌ను  ఉతికారేసిన కోదండ‌రాం!

నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కోసం ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించిన జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం సీఎంలు బాబు, కేసీఆర్‌ల‌పై మండిప‌డ్డారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నాలుగో మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు విధానాల‌ను తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. పారిశ్రామిక విధానంలో చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన స‌ర‌ళీకృత విధానాల వ‌ల్ల  తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య పెరిగిపోయింద‌ని ఆరోపించారు. ఫ‌లితంగా అనేక ప్ర‌భుత్వ పారిశ్రామిక రంగాలు కుదేల‌య్యాయ‌ని […]

చంద్ర‌బాబు, కేసీఆర్ ల‌ను  ఉతికారేసిన కోదండ‌రాం!
X
నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి కోసం ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించిన జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం సీఎంలు బాబు, కేసీఆర్‌ల‌పై మండిప‌డ్డారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నాలుగో మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబు విధానాల‌ను తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. పారిశ్రామిక విధానంలో చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన స‌ర‌ళీకృత విధానాల వ‌ల్ల తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య పెరిగిపోయింద‌ని ఆరోపించారు. ఫ‌లితంగా అనేక ప్ర‌భుత్వ పారిశ్రామిక రంగాలు కుదేల‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాలు రాక‌పోవ‌డానికి కూడా ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన కాంట్రాక్టు వ్య‌వ‌స్థే కార‌ణ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పారిశ్రామిక వేత్త‌ల‌కు అనుకూలంగా, నిరుద్యోగ యువ‌త‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలే నేడు రెండురాష్ర్టాల్లో నిరుద్యోగం పెరిగిపోయేందుకు కార‌ణ‌మైంద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన విధానాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ విధానాలు చాలా దుర్మార్గ‌మైన‌వ‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు.
ఏపీ సీఎం చంద్ర‌బాబును ఉతికారేసిన కోదండ‌రాం తెలంగాణ సీఎంనూ వ‌ద‌ల్లేదు. తెలంగాణ వ‌స్తే.. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఊద‌ర‌గొట్టిన కేసీఆర్ ఆ మేర‌కు ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆరోపించారు. తెలంగాణ ఉద్య‌మంలో సింగ‌రేణి కార్మికులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తామ‌ని చెప్పిన కేసీఆర్ సీఎం అయిన త‌రువాత ఆ మాట ఎందుకు నిల‌బెట్టుకోలేద‌ని ప్ర‌శ్నించారు. పారిశ్రామిక‌, ఉద్యోగ రంగాల్లో చంద్ర‌బాబు సృష్టించి వెళ్లిన పెట్టుబ‌డి దారి అనుకూల దుర్మార్గ‌పు సంప్ర‌దాయాల‌ను కేసీఆర్ కూడా కొన‌సాగించ‌డం దుర‌దృష్ట క‌ర‌మ‌న్నారు. కాంట్రాక్టు కార్మికుల‌ను గ‌త పాల‌కుల కంటే క‌ట్టి బానిస‌లుగా కేసీఆర్ ప‌రిగ‌ణిస్తున్నార‌ని ఆరోపించారు.
First Published:  14 Aug 2016 4:52 AM IST
Next Story