Telugu Global
Cinema & Entertainment

తన పిల్లలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నసంజయ్ దత్

నెలల తరబడి ఇంటికి రాని తండ్రి గురించి అడిగినప్పుడు తల్లి ఏమని చెపుతుంది? ఏవో కట్టు కథలు చెప్పి మరిపించాలని చూస్తుంది. ఇక్కడ తండ్రే పచ్చి అబద్ధాలతో తన పిల్లలను మోసపుచ్చుతున్నాడు. అతనెవరో కాదు.. బాలివుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. మొన్న మొన్నటి వరకు జైలు జీవితం గడిపి, తన శిక్షా కాలం పూర్తి చేసుకుని… ఇప్పుడిప్పుడే స్వేచ్ఛాగాలులు పీల్చుకుంటున్నాడు. కాని జైలులో ఉన్నప్పుడు … తాను షూటింగ్స్ కోసం పర్వత ప్రాంతాలకు వెళుతున్నాని చెప్పేవాడు. […]

తన పిల్లలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నసంజయ్ దత్
X

నెలల తరబడి ఇంటికి రాని తండ్రి గురించి అడిగినప్పుడు తల్లి ఏమని చెపుతుంది? ఏవో కట్టు కథలు చెప్పి మరిపించాలని చూస్తుంది. ఇక్కడ తండ్రే పచ్చి అబద్ధాలతో తన పిల్లలను మోసపుచ్చుతున్నాడు. అతనెవరో కాదు.. బాలివుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. మొన్న మొన్నటి వరకు జైలు జీవితం గడిపి, తన శిక్షా కాలం పూర్తి చేసుకుని… ఇప్పుడిప్పుడే స్వేచ్ఛాగాలులు పీల్చుకుంటున్నాడు. కాని జైలులో ఉన్నప్పుడు … తాను షూటింగ్స్ కోసం పర్వత ప్రాంతాలకు వెళుతున్నాని చెప్పేవాడు. నెలకు రెండుసార్లు తన బిడ్దలతో ఫోన్‌లో మాట్లాడే సౌకర్యం ఉండడం వలన.. ఈ విధంగా మ్యానేజ్ చేసేవాడినని సంజయ్ దత్ తానే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఎదిగే పిల్లలకు తన తండ్రి జైలులో ఉన్నాడని తెలియడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఉద్ధేశ్యంతో మాత్రమే ఇలా అబద్ధాలు చెప్పానని ఈ తండ్రి మాట. నిజమే మరి.

First Published:  14 Aug 2016 8:07 AM IST
Next Story