జాతీయ పతాకాలు... పేపరువే వాడాలి... ప్లాస్టిక్‌వి వద్దు!
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో జాతీయ జెండాలను ప్లాస్టిక్‌తో తయారుచేసినవి వాడవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తోరణాలుగా అలంకరణ…వ్యక్తుల అలంకరణ…తదితర వినియోగాలకోసం చిన్నసైజులో ఉండే జాతీయ పతాకాలను ఆగస్టు 15న వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి ప్లాస్టిక్‌తో తయారయినవి కాకుండా పేపర్‌తో తయారుచేసినవే అయి ఉండాలని… కేంద్రం, రాష్ట్రాల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ పద్ధతిని పాటించాలని హోం మంత్రిత్వ శాఖ సూచించింది. వేడుకల అనంతరం వాటిని […]
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో జాతీయ జెండాలను ప్లాస్టిక్‌తో తయారుచేసినవి వాడవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తోరణాలుగా అలంకరణ…వ్యక్తుల అలంకరణ…తదితర వినియోగాలకోసం చిన్నసైజులో ఉండే జాతీయ పతాకాలను ఆగస్టు 15న వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి ప్లాస్టిక్‌తో తయారయినవి కాకుండా పేపర్‌తో తయారుచేసినవే అయి ఉండాలని… కేంద్రం, రాష్ట్రాల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ పద్ధతిని పాటించాలని హోం మంత్రిత్వ శాఖ సూచించింది.
వేడుకల అనంతరం వాటిని గ్రౌండ్‌ల్లో…కాళ్లకింద పడేలా పారవేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఈ విషయాన్ని రాష్ట్రాలు… ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రచారం చేయాలని సలహా ఇచ్చింది. ప్లాస్టిక్‌తో తయారు చేస్తే అవి చాలాకాలం పాటు అలాగే నిలిచి ఉంటాయని..దాంతో చెత్తాచెదారంలో కనబడుతూ ఉంటాయని…ఇది జాతీయపతాకాన్ని అవమానించడమే అవుతుందని..అందుకే త్వరగా భూమిలో కలిసిపోయే పేపరు పతాకాలనే వాడాలని వివరించింది. జాతీయ పతాకం ప్రజల ఆశల, ఆశయాల ప్రతిరూపమని, కనుకదాన్ని ఏ విధంగానూ అగౌరవ పరచకూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.