కులాభిమాన చిత్రానికి భారీ షాక్
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో రెడ్లను, బ్రహ్మణులను, కొన్ని బీసీ కులాల పేర్లను విలన్లకు, కమెడియన్లకు పెట్టి కించపరచడం సర్వసాధారణమైంది. ఇందుకు సినీ పరిశ్రమను తమ గుప్పెట్లో పెట్టుకున్న ఒక కులం డైరెక్టర్లు, నిర్మాతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కేటగిరిలోనే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన చుట్టాలబ్బాయి కూడా నిలుస్తోంది. కులాభిమానం అధికంగా ఉన్న డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి… పనిగట్టుకుని ఈ చిత్రంలో రెడ్డి కులం పేరును ఒక కమెడీ క్యారెక్టర్‌కు పెట్టి ఆనందించారని చెబుతుంటారు. […]
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో రెడ్లను, బ్రహ్మణులను, కొన్ని బీసీ కులాల పేర్లను విలన్లకు, కమెడియన్లకు పెట్టి కించపరచడం సర్వసాధారణమైంది. ఇందుకు సినీ పరిశ్రమను తమ గుప్పెట్లో పెట్టుకున్న ఒక కులం డైరెక్టర్లు, నిర్మాతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి కేటగిరిలోనే సాయికుమార్ కుమారుడు ఆది నటించిన చుట్టాలబ్బాయి కూడా నిలుస్తోంది. కులాభిమానం అధికంగా ఉన్న డైరెక్టర్ వీరభద్రమ్ చౌదరి… పనిగట్టుకుని ఈ చిత్రంలో రెడ్డి కులం పేరును ఒక కమెడీ క్యారెక్టర్‌కు పెట్టి ఆనందించారని చెబుతుంటారు.
అయితే లేటెస్ట్‌గా ఈ చిత్రానికి నైజాంలో గట్టి షాకే తగిలిందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కొనేందుకు నైజాం బయ్యర్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది. చుట్టాలబ్బాయిని డీల్ చేసిన బయ్యరే ఆటాడుకుందాం రా చిత్రాన్ని కూడా కొన్నారని సమాచారం. అయితే ఇప్పటికే థియేటర్లలో అనేక సినిమాలు ఉండడంతో థియేటర్ల కొరత కనిపిస్తోంది. దీంతో చుట్టాలబ్బాయి బయ్యర్ ఆఖరి నిమిషంలో వెనక్కు తగ్గారని చిత్రపరిశ్రమలో టాక్. ఆటాడుకుందాం రా చిత్రాన్ని తీసుకోవాలా చుట్టాలబ్బాయిని ముందుకు తీసుకెళ్లాలా అని తర్జన భర్జన పడిన బయ్యర్ చివరకు మొదటి చిత్రానికే కమిట్ అయ్యారని చెబుతున్నారు. చుట్టాలబ్బాయి కంటే ఆటాడుకుందాంరాను నమ్మకుంటే మంచి లాభాలు వస్తాయన్న ఉద్దేశంతోనే బయర్ ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెబుతున్నారు. అయితే బయ్యర్ నుంచి ఇలాంటి స్పందన రావడంతో చిత్ర డైరెక్టర్, యూనిట్ తమ మార్గాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెబుతున్నారు. నిజానికి చుట్టాలబ్బాయి చిత్రం ఈనెల మొదటివారంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ పోటీని తట్టుకోలేక 19కి వాయిదా వేశారని చెబుతున్నారు. ఈ పరిణామాలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతాయో!.
Click on Image to Read: