జగన్ ఇంటి వద్ద టీడీపీ నేతల హైడ్రామా
పుష్కరాలకు పది రోజుల ముందే సినిమా తారాలను, నాయకులను, న్యాయమూర్తులను ఆహ్వనించిన చంద్రబాబు … ప్రతిపక్ష నేత జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశం రాజకీయరంగు పులుముకుంటోంది. పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను పిలిచేందుకు టీడీపీ నేతలు రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే పుష్కరాలు ప్రారంభం కాగా… రాత్రి సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే కూనరవికుమార్ జగన్ నివాసానికి వచ్చారు. అయితే ఇక్కడే టీడీపీ నేతల […]

పుష్కరాలకు పది రోజుల ముందే సినిమా తారాలను, నాయకులను, న్యాయమూర్తులను ఆహ్వనించిన చంద్రబాబు … ప్రతిపక్ష నేత జగన్‌ను మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశం రాజకీయరంగు పులుముకుంటోంది. పుష్కరాలు ప్రారంభమయ్యాక జగన్‌ను పిలిచేందుకు టీడీపీ నేతలు రావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే పుష్కరాలు ప్రారంభం కాగా… రాత్రి సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే కూనరవికుమార్ జగన్ నివాసానికి వచ్చారు.
అయితే ఇక్కడే టీడీపీ నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి.అమలాపురం పర్యటనకు వెళ్లిన జగన్ ఇంటిలో ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకోకుండా టీడీపీ నేతలు నేరుగా రావడం ఎంతవరకు సమంజసమని పార్థసారథి ప్రశ్నించారు. అసలు పుష్కరాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షనేతను ఆహ్వానించడం ఎక్కడి సాంప్రదాయమని ప్రశ్నించారు. కేవలం జగన్‌ను బదనాం చేసేందుకు చంద్రబాబు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ అనుకూల ఛానల్ మాత్రం జగన్ ఇంటిలో ఉన్నా తనకు కలిసే ఓపిక లేదంటూ టీడీపీ నేతలను వెనక్కు పంపారని చెబుతోంది. రావెల కిషోర్ బాబు తాము ఎవరినీ అవమానించడం లేదన్నారు. అందరినీ పిలిచినట్టుగానే జగన్‌ను పిలిచేందుకు వచ్చామన్నారు. శనివారం ఉదయం 10గంటలకు మరోసారి వచ్చి జగన్‌ను కలిసే ప్రయత్నం చేస్తామన్నారు.
Click on Image to Read: