"మా టీవీ" గ్రూప్ కు షాక్ ఇచ్చిన కేంద్రం
మా టీవీ నెట్‌వర్క్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మా టీవీ గ్రూప్‌కు చెందిన మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ ఛానళ్ల లైసెన్స్‌ల రెన్యువల్‌కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. లైసెన్స్ రెన్యువల్ జాబితా నుంచి మా గ్రూప్ నాలుగు ఛానళ్లను పక్కనపెట్టింది. మా గ్రూప్ డైరెక్టర్ నిమ్మగడ్డ ప్రసాద్‌పై ఉన్న ఆర్దిక నేరాల అభియోగాల కారణంగానే లైసెన్స్‌లు రెన్యువల్ నిరాకరించినట్టు చెబుతున్నారు. ప్రసార మంత్రిత్వశాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ […]
మా టీవీ నెట్‌వర్క్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మా టీవీ గ్రూప్‌కు చెందిన మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ ఛానళ్ల లైసెన్స్‌ల రెన్యువల్‌కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. లైసెన్స్ రెన్యువల్ జాబితా నుంచి మా గ్రూప్ నాలుగు ఛానళ్లను పక్కనపెట్టింది. మా గ్రూప్ డైరెక్టర్ నిమ్మగడ్డ ప్రసాద్‌పై ఉన్న ఆర్దిక నేరాల అభియోగాల కారణంగానే లైసెన్స్‌లు రెన్యువల్ నిరాకరించినట్టు చెబుతున్నారు.
ప్రసార మంత్రిత్వశాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మా టీవీ చానెల్స్ ను స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది. కాబట్టి కేంద్ర ప్రసార శాఖ తాజా అభ్యంతరం నేపథ్యంలో లైసెన్స్‌లనే తమ పేరున మార్చుకునేందుకు స్టార్ గ్రూప్ సిద్ధమైనట్టు సమాచారం. అయితే మా ఛానల్స్ కు లైసెన్స్ ల రెన్యువల్ నిరాకరణ వెనుక మరేమైనా రాజకీయ కారణం ఉందా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. గత కొంత కాలంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న 73 టీవీ ఛానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది.
Click on Image to Read: