అలా అయితే వరుసగా ఎందుకు ఓడించారో?
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తయారవుతోంది టీడీపీ నేతల తీరు. స్పీకర్ స్థానంలో ఉంటూ టీడీపీ ప్రచారకర్తగా కోడెల శివప్రసాద్ వ్యవహరించడం పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉంది. కానీ ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు చికాగోలో పర్యటిస్తున్న కోడెల .. టీడీపీని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సదస్సులో పాల్గొన్న ఆయన… తెలుగువారంతా ఆమోదించిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. ఎన్‌టీఆర్ గుర్తింపునిస్తే చంద్రబాబు ఆత్మస్థైర్యం కలిగించారని బాబుపై […]
నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా తయారవుతోంది టీడీపీ నేతల తీరు. స్పీకర్ స్థానంలో ఉంటూ టీడీపీ ప్రచారకర్తగా కోడెల శివప్రసాద్ వ్యవహరించడం పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉంది. కానీ ఆయన మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు చికాగోలో పర్యటిస్తున్న కోడెల .. టీడీపీని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సదస్సులో పాల్గొన్న ఆయన… తెలుగువారంతా ఆమోదించిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. ఎన్‌టీఆర్ గుర్తింపునిస్తే చంద్రబాబు ఆత్మస్థైర్యం కలిగించారని బాబుపై పొగడ్తలు కురిపించారు కోడెల. టీడీపీ మూలాలు గుర్తెరిగి నవ్యాంధ్ర నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని పరోక్షంగా అసలు విషయం కొందరికి బాగా అర్థమయ్యేలా చెప్పారు. పైగా స్పీకర్ రాక సందర్భంగా విదేశాల్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ కార్ల ర్యాలీ అంటూ ఫొటోలను స్వయంగా ఫేస్ బుక్ టైమ్ లైన్ల మీద పోస్టు చేసుకోవడం, ఇలాంటి దుస్థితి ఏ రాష్ట్రంలోని స్పీకర్ స్థానానికి కూడా వచ్చి ఉండదు కాబోలు. అయినా తెలుగువారంతా ఆమోదించిన పార్టీ టీడీపీ అయితే వరుసగా పదేళ్లు ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆఖరి రౌండ్లో వెయ్యిలోపు ఓట్ల సాయంతో కోడెల శివప్రసాదరావు ముక్కీమూలిగి మొన్నటి ఎన్నికల్లో ఎందుకు గెలవాల్సి వచ్చిందో?. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసేందుకు కూడా స్పీకర్ చేతులు ఎందుకు వణకాల్సి వస్తున్నాయో?. టీడీపీకి అంత భారీగా జనామోదమే ఉంటే ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లేవారు కదా!.
ఇప్పుడే కాదు గతంలోనూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒకసారి కమ్మ సామాజికవర్గానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరై… తమ కులానికి అధికారం దక్కడంపై వ్యాఖ్యలు చేయడం, ఆ విషయం పత్రికల్లో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరో సందర్భంలో కమ్మ ప్రముఖుల విశేషాలతో రచించిన పుస్తకావిష్కరణకు హాజరైన కోడెల శివప్రసాదరావు… విదేశాల్లో మన కమ్మవారే అధికంగా ఉన్నారని పొగుడుకున్నారు. బెస్ట్ ఎన్నారై గ్రూప్ ఏదైనా ఉందంటే అది కమ్మ సామాజివర్గం గ్రూపేనని ఒక స్పీకర్‌గా ఉంటూ వ్యాఖ్యానించారు. ఇలా పవిత్రమైన స్పీకర్ స్థానంలో ఉంటూ ఒక పార్టీకి, ఒక కులానికి అనుకూలంగా మాట్లాడడంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. స్పీకర్ హోదాలో ఒకసారి పార్టీ ఫిరాయించిన నాయకులకు కోడెల శివప్రసాద్‌రావు కండువాలు కప్పడంపైనా ప్రతిపక్షాలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలిచేందుకు 11. 5కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా కెమెరా ముందు చెప్పిన ఘనత కూడా స్పీకర్ హోదాలో కోడెలకే దక్కింది. ఇప్పుడు కూడా అదే ధోరణిలో విదేశాలకు వెళ్లి అక్కడి తెలుగువారికి కూడా పార్టీల, కులాల రంగులు పూయడం వంటి చర్యల ద్వారా స్పీకర్ స్థానానికి గౌరవం పెంచుతున్నారో లేక దిగజారుస్తున్నారో కోడెల శివప్రసాదరావు ఆలోచించుకోవాలి.
Click on Image to Read: